మూడు నెలలు అన్నం కూడా తినలేదు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా! సీనియర్ సినీ నటుడు - ఎందుకు అంటే!

Header Banner

మూడు నెలలు అన్నం కూడా తినలేదు.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా! సీనియర్ సినీ నటుడు - ఎందుకు అంటే!

  Sat Nov 30, 2024 13:54        Entertainment

తన కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించానని సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. చేతిలో డబ్బుల్లేక దాదాపు మూడు నెలలు అన్నం కూడా తినలేదని తెలిపారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని రాజేంద్రప్రసాద్ తెలిపారు. స్కూల్ టీచర్ అయిన తన తండ్రి ఎంతో స్ట్రిక్ట్ గా ఉండేవారని... తాను సినిమాల్లోకి వెళ్లాలనుకుంటున్నానని చెపితే అసహనం వ్యక్తం చేశారని చెప్పారు. నీ ఇష్టానికి వెళ్తున్నావు... సినిమాల్లో ఫెయిల్ అయితే ఇంటికి రావద్దని అన్నారని తెలిపారు. ఆయన మాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పారు. ఆ తర్వాత తాను మద్రాస్ వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరానని... గోల్డ్ మెడల్ సాధించానని తెలిపారు.

 

ఇంకా చదవండి: అల్లు అర్జున్ పై జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు! ఎవరు పెట్టారు? ఎందుకో తెలిస్తే షాక్!

 

అయితే సినిమా అవకాశాలు మాత్రం రాలేదని చెప్పారు. ఇంటికి తిరిగి వెళ్తే... రావద్దన్నాను కదా ఎందుకు వచ్చావని నాన్న అన్నారని... ఎంతో బాధతో వెంటనే మద్రాస్ కు వచ్చానని తెలిపారు.  ఒకరోజు నిర్మాత పుండరీకాక్షయ్య ఆఫీసుకు వెళ్తే... అక్కడ ఏదో గొడవ జరుగుతోందని... తన రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన తనను డబ్బింగ్ థియేటర్ కు తీసుకెళ్లారని... ఒక సీన్ కు తనతో డబ్బింగ్ చెప్పించారని... అది ఆయనకు బాగా నచ్చడంతో రెండో సీన్ కు డబ్బింగ్ చెప్పించారని తెలిపారు. అలా తన డబ్బింగ్ ప్రయాణం మొదలయిందని... మద్రాస్ లో ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. ఆ తర్వాత దర్శకుడు వంశీతో పరిచయం కావడం... ఆయన సినిమాలలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నానని అన్నారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారు? అసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలు' పేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. 5 లక్షలు! నెలకు ఎంత కట్టాలంటే? అసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులు, వర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణ, తమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove