పుష్ఫ 2 టికెట్ రేట్లపై పిట్టకథ చెప్పిన ఆర్జీవీ.. సంచలన ట్వీట్! రేటు ఎక్కువని అనుకుంటే!

Header Banner

పుష్ఫ 2 టికెట్ రేట్లపై పిట్టకథ చెప్పిన ఆర్జీవీ.. సంచలన ట్వీట్! రేటు ఎక్కువని అనుకుంటే!

  Wed Dec 04, 2024 17:08        Entertainment

పుష్ప 2 సినిమా టికెట్ రేట్లపై విమర్శలు చేస్తున్న వారికి రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో గట్టిగా జవాబిచ్చారు. టికెట్ రేట్లు ఎక్కువని అనుకునే వారు సినిమా చూడొద్దని సూచించారు. వారం తర్వాతో లేక నెల తర్వాతో టికెట్ ధరలు తగ్గాకే సినిమా చూడాలని హితవు పలికారు. ఎంటర్టైన్ మెంట్ నిత్యావసరం కాదని, నిత్యావసరాల ధరలు పెరిగినా, లగ్జరీ, బ్రాండెడ్ వస్తువుల ధరలపైనా ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరలపై మాత్రం ఎందుకు ఏడుస్తున్నారని ఆర్జీవీ నిలదీశారు. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్  డిఫరెన్స్ మీదే పనిచేస్తుందన్నారు. అన్ని వస్తువులలాగే  సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి తప్ప ప్రజాసేవ కోసం కాదని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ ఓ పిట్టకథ చెప్పారు. ‘‘సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి, ప్లేట్ ఇడ్లీల ధరను రూ.1000గా పెట్టాడు.

 

ఇంకా చదవండి: అక్కినేని ఇంట పెళ్లి సందడి... ఆ కారు శోభిత కోసమే కొన్నారా? ఈ పెళ్లికి హాజ‌రు కానున్న‌ సినీ, రాజ‌కీయ రంగానికి!

 

సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.  “సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు”అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత  వెర్రితనం. ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమానే’’ అని ట్వీట్ చేశారు. నిత్యావసరాలని బ్రాండింగ్ ఉన్న ఇల్లు, తిండి, బట్టల ధరలే ఆకాశాన్ని తాకుతుంటే నిత్యావసరం కాని పుష్ప 2 సినిమాకు ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువేనని ఆర్జీవీ తేల్చిచెప్పారు. రేట్లు ఎక్కువ అని అనుకునే వారు సినిమా చూడడం మానేయొచ్చు లేదా రేట్లు తగ్గాక చూడొచ్చు.. వారికి ఆ ఆప్షన్ ఉందని గుర్తుచేశారు. ఇక, సుబ్బారావు హోటల్ చైన్ విషయానికి వస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయిందని చెప్పారు. సుబ్బారావుకు చెందిన ఏ హోటల్ లోనూ కూర్చునేందుకు చోటు దొరకకపోవడమే దీనికి నిదర్శనమని పరోక్షంగా పుష్ప 2 సినిమాకు బుకింగ్స్ మొత్తం పూర్తయ్యాయని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొడాలి నానికి వరుస షాక్ లు! తొమ్మిది మంది అరెస్ట్ - పరారీలో ప్రధాన అనుచరుడు..

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి నారా లోకేశ్ కీలక నిర్ణయం! ఇక ఆ సమస్య లేనట్టే!

 

మందుబాబులకు బిగ్ షాక్.. రాష్ట్రంలో వైన్స్ బంద్! ఎప్పటి నుంచంటే..? ఎందుకంటే?

 

ఆ జిల్లాలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్! ఇలా అప్లై చేసుకుంటే - నేరుగా అకౌంట్లోకి రూ. 2.50 లక్షలు జమ!

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ... ఐటీ గ్లోబల్ పాలసీకు ఆమోదం! ఆంధ్రా పెట్టుబడులు పెట్టేవారికి గొప్ప అవకాశం!

 

అమరావతి అభివృద్ధికి కోటి విరాళం అందించిన మహిళ! తల్లి కోరిక నెరవేర్చిన కుమార్తె!

 

చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ! పలు కీలక అంశాలపై!

 

టీడీపీలోకి వైసీపీ కీలక నేత..? చంద్రబాబు సమక్షంలో చేరిక! మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా!

 

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove