రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ!

Header Banner

రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ!

  Mon Dec 09, 2024 09:06        Entertainment

ఇటీవ‌ల తెలుగువారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో సినీన‌టి క‌స్తూరి జైలుకు వెళ్లొచ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క‌స్తూరి ఆదివారం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కీల‌క పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల‌ను ఉద్దేశిస్తూ రాష్ట్రంలో ఉద‌యించే సూర్యుడికి శ‌త్రువుగా రెండాకుల గుర్తే 60 ఏళ్లుగా ఉంద‌న్నారు. ఇక కొత్త‌గా టీవీకే పార్టీ పెట్టిన న‌టుడు విజ‌య్ ఇంకా పార్టీ గుర్తు తీసుకోలేద‌ని, ఆయ‌న ఏ చిహ్నం తీసుకోనున్నారో తెలియ‌ద‌న్నారు. ఓ పార్టీ కూట‌మికి వ్య‌తిరేకంగా అన్నీ పార్టీలు వేర్వేరుగా పోరాడుతున్నాయ‌ని, అవ‌న్నీ ఒకే గొడుగు కిందికి రావాల‌ని క‌స్తూరి తెలిపారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌న్నింటికీ అధికార పార్టీనే కార‌ణ‌మ‌న్న మాన‌సిక‌స్థితికి వ‌చ్చేశార‌న్నారు. ఇక తాను జైలుకు వెళ్లిన‌ప్పుడు త‌న‌కు మ‌ద్ద‌తుగా మొద‌ట మాట్లాడిన వ్య‌క్తి సీమాన్ అని ఆమె పేర్కొన్నారు. అందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అయితే, సీమాన్‌ కూడా ఈసారి ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ చేయాల‌నుకుంటున్నార‌ని క‌స్తూరి చెప్పారు.    

 

ఇంకా చదవండి: చంద్రబాబు ఒక్క ఆంధ్రాకే కాదు... ప్రపంచానికి నాయకుడు అవ్వాలి! భావాలను మాటలలో వర్ణించలేము! "వన్ డే విత్ సీఎం" అనుభవాలు పంచుకున్న ఎన్ఆర్ఐ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

 

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

 

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove