ఎగిరి గంతేసే న్యూస్.. ఈరోజు నుంచి 'పుష్ప-2' టికెట్ ధ‌ర‌ల్లో భారీ త‌గ్గింపు! విడుద‌లైన మూడు రోజుల్లోనే!

Header Banner

ఎగిరి గంతేసే న్యూస్.. ఈరోజు నుంచి 'పుష్ప-2' టికెట్ ధ‌ర‌ల్లో భారీ త‌గ్గింపు! విడుద‌లైన మూడు రోజుల్లోనే!

  Mon Dec 09, 2024 10:08        Entertainment

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో వ‌చ్చిన 'పుష్ప‌2: ది రూల్' బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో క‌లెక్ష‌న్ల‌ సునామీ సృష్టిస్తోంది. విడుద‌లైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 621 కోట్లు కొల్ల‌గొట్టిన‌ట్లు మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఈ చిత్రానికి టికెట్ ధ‌ర‌లు పెంచుకోవడానికి వెసులుబాటు క‌ల్పించ‌డంతో ధ‌ర‌లు భారీగా పెరిగిపోయి చాలామంది సినిమా చూడ‌టానికి వెనుకాడారు. అలాంటి వారికి ఇవాళ్టి నుంచి 'పుష్ప-2' టికెట్ ధ‌ర‌లు త‌గ్గ‌నుండ‌డం అనేది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. తెలంగాణ స‌ర్కార్ ఈ మూవీ కోసం తేదీల వారీగా శ్లాబ్‌ల రూపంలో టికెట్ ధ‌ర‌లు పెంచుకోవ‌డానికి వీలు క‌ల్పించిన విష‌యం తెలిసిందే.

 

ఇంకా చదవండి: లక్కీ ఛాన్స్.. ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ తగ్గింపు ఆఫర్! కొనాలనుకుంటే చక్కటి అవకాశం!

 

దీని ప్ర‌కారం డిసెంబ‌ర్ 9 నుంచి 16 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్ల‌లో రూ. 105, మ‌ల్టీప్లెక్స్‌లో రూ. 150 పెంపున‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి నిచ్చింది. కానీ, నైజాం ఏరియాలో పెంచిన ధ‌ర‌తో పోలిస్తే టికెట్ ధ‌ర‌లు ఇంకాస్త త‌గ్గిన‌ట్లు ప్ర‌ముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో చూపిస్తోంది. సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధ‌ర రూ. 200 (జీఎస్‌టీ అద‌నం)గా ఉండ‌గా... మ‌ల్టీప్లెక్స్‌లో రూ. 395 (జీఎస్‌టీ అద‌నం)గా ఉంది. దీని ప్ర‌కారం చూస్తే సింగిల్ స్క్రీన్ల‌తో పాటు మ‌ల్టీప్లెక్స్‌లోనూ అనుమ‌తి తీసుకున్న మేర‌కు టికెట్ ధ‌ర‌ను పెంచ‌లేద‌ని తెలుస్తోంది. అలాగే విజ‌య‌వాడ‌లోనూ సింగిల్ స్క్రీన్‌లో రూ. 220గా ఉంటే... మ‌ల్టీప్లెక్స్‌లో రూ. 300 మాత్ర‌మే ఉంది. అటు విశాఖ‌లో సింగిల్ స్క్రీన్‌లో రూ. 295 ఉండ‌గా, మ‌ల్టీప్లెక్స్‌లో రూ. 300-377 వ‌ర‌కూ ఉన్న‌ట్లు బుక్‌మై షో చూపిస్తోంది.

 

ఇంకా చదవండి: చంద్రబాబు ఒక్క ఆంధ్రాకే కాదు... ప్రపంచానికి నాయకుడు అవ్వాలి! భావాలను మాటలలో వర్ణించలేము! "వన్ డే విత్ సీఎం" అనుభవాలు పంచుకున్న ఎన్ఆర్ఐ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పోలీస్ కస్టడీకి వైసీపీ నేత రౌడీ షీటర్! నిజాలు చెప్పేస్తా..? టెన్షన్ లో జగన్..

 

రాజ‌కీయాల‌పై సినీన‌టి క‌స్తూరి కీల‌క వ్యాఖ్య‌లు! ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీ!

 

ఏపీ ప్రజలకు ఒక పెద్ద ఊరట కలిగించే విషయం.. సంవత్సరం పాటు ఉచిత! ప్రభుత్వం కీలక నిర్ణయం!

 

నేడు (9/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! ఇంక పండగే పండగ! ప్రత్యేక రైలు సర్వీసులు!

 

ఒరేయ్ మీ దుంపలు తెగ.. 102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు! ఇక్కడ మరో విశేషం ఏమిటంటే..

 

రైల్వే స్టేషన్‌లో కోతుల ఫైట్‌ వల్ల ఆగిపోయిన రైళ్లు! అసలు ఏం జరిగిందంటే!

 

అప్డేట్.. ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రిటర్న్ రాలేదా? అయితే ఇలా చేయండి! రాష్ట్రంలో ఏ ఇతర పథకాల్లో..

 

దారుణం.. తిరుమల కొండపై కారు దగ్ధం! ఆ సమయంలో కారులో...

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Pushpa-2 #Pushpa-2latestupdateAlluArjun #Rashmika #MandannaSukumar #Pushpa #Alluarjun #latestupdate #Pushpa-2pressmeet