రాత్రిళ్ళు పెరుగుతున్న మానసిక ఆందోళన! ఎలా బయటపడాలో చెప్తున్న నిపుణులు!
Tue Aug 20, 2024 20:09 Life Styleకారాణాలేమైనా ప్రస్తుతం చాలామందిలో మెంటల్ యాంగ్జెటీస్ పెరిగిపోతున్నాయి. బిజీ లైఫ్ షెడ్యూల్, వర్క్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఇందుకు కారణం అవుతున్నాయి. పొద్దస్తమానం పనిలో నిమగ్నమై మిగతా విషయాలు పట్టించుకోని వారు కూడా రాత్రిళ్లు నిద్రకు ఉపక్రమించే ముందు తరచుగా ఆందోళన చెందేపరిస్థితి ఇప్పుడు యువతలో, పెద్దల్లో పెరిగిపోతోందని నిపుణులు అంటున్నారు. కాగా రాత్రిపూట ఆందోళనతో గుండె దడ, అలసట పెరగడం, ఏకాగ్రత లోపించడం, కండరాల సంకోచం వంటి సమస్యలు కూడా బాధితులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి యాక్టివిటీస్ ఉండవు కాబట్టి ఆలోచనలు మెదడును ప్రభావితం చేస్తుంటాయి. సమస్యల్లో ఉన్నవారు వాటిని మరింత లోతుగా ఊహించుకొని ఆందోళన పడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి క్రమంగా నిద్రలేమికి కూడా దారితీస్తుంది.
రాత్రిపూట మాత్రమే ఎక్కువ ఆందోళన చెందడానికి కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ కూడా ప్రధాన కారణం. వాస్తవానికి ఇది బాడీ సిర్కాడియన్ రిథమ్ ఆధారంగా వర్క్ చేస్తుంది. వివిధ సమస్యలు, పొద్దస్తమానం ఎదుర్కొన్న చేదు అనుభవాలను తలచుకొని బాధపడేవారిలో ఇది పెరిగిపోయి మరింత ఆందోళనకు కారణం అవుతున్నట్లు మానసిక నిపుణల పేర్కొంటున్నారు.
ఇంకా చదవండి: గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త! అకౌంట్లలోకి డబ్బులు! అదెలా అని అనుకుంటున్నారా?
పగలు ఏదో ఒక బిజీలో ఉంటాం. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే చుట్టు పక్కల జనాలు ఉంటారు. ఆఫీసుల్లో ఉన్నప్పుడు కొలీగ్స్, ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే గమనించి వెంటనే విషయం తెలుసుకొని మనల్ని ఆ పరిస్థితి నుంచి డైవర్ట్ చేయడం ద్వారా ఆందోళన నుంచి బయటపడేస్తారు. కానీ రాత్రిళ్లు ఒంటరిగా పడుకొని ఉన్నప్పుడు.. పదే పదే గుర్తుకు వచ్చి వేధించే రేసింగ్ థాట్స్ ఎవరికి తెలుస్తాయి? వాటికి మీరే టార్గెట్. కాబట్టి బుర్రతినేస్తాయి. అలాంటి అతి ఆలోచనలు తరచుగా రావడం ఓవర్ యాంగ్జెటీస్కు దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు.
రాత్రిపూట మనసు ప్రశాంతంగా లేకపోవడం, శ్వాస సరిగ్గా తీసుకోలేని అసౌకర్యం, గుండె దడ, కండరాలపై ఒత్తిడి వంటివి కూడా ఆందోళనకు కారణం అవుతాయి. దీంతో నిద్రపట్టదు. అనుకోని సంఘటనలు, ఆపదలు, మనస్సును కలచివేసే ఘటనలు కూడా రాత్రిళ్లు ఆందోళనకు దారితీస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇంకా చదవండి: వైసీపీలో ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరు! అందరూ మాతో టచ్ లోనే ఉన్నారు! ఎప్పుడు వస్తారంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నైట్ యాంగ్జెటీస్ ఎక్కువగా అతి ఆలోచనలు, నిద్రలేమి వల్ల వేధిస్తుంటాయి. ఇవి పరోక్షంగా ఇతర అనారోగ్యాలకు కారణం అవుతుంటాయి. కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. బాధాకరమైన, మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే ఆలోచనలు డైవర్ట్ చేసే వెదరన్ను క్రియేట్ చేసుకోవాలి. బెడ్ రూమ్లో లేదా మీరు పడుకునే ప్లేస్లో మీకు హాయిగా అనిపించేలా ఉండాలి తప్ప గందరగోళ వాతావరణం ఉండకూడదని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల ప్రశాంగా నిద్రపడుతుంది. దీంతో అతి ఆలోచనలు వచ్చే అవకాశం ఉండదు. అలాగే మీరు తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటూ ఉంటే కూడా ఆలోచనలు దానిచుట్టే తిరుగుతుంటాయి. ముఖ్యంగా ప్రాబ్లంను ఎదుర్కొనే విషయంలో క్లారిటీ లేకపోవడం కూడా యాంగ్జెటీస్కు కారణం అవుతుంది. కాబట్టి అసలు ప్రాబ్లం ఏమిటి?, దానికి గల పరిష్కార మార్గాలేమిటి? అనేది నోట్ చేసుకుంటే మీకంటూ ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.
బుక్స్ చదవడం, నచ్చిన మ్యూజిక్ను ఆస్వాదించడం, ధ్యానం, మెడిటేషన్, వంటివి మానసిక ప్రశాంతకు దోహదం చేయడం ద్వారా రాత్రిళ్లు మానసిక ఆందోళన తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే లేట్గా భోజనం చేయడం, కాఫీ, టీ వంటి కెఫిన్ రిలేటెడ్ పానీయాలు తీసుకోకపోవడం, ధూమపానం, మద్య పానం వంటివి తగ్గించడం ద్వారా రాత్రిపూట ఆందోళనలను నివారించడంలో సహాయపడతాయని మానసిక నిపుణులు చెప్తున్నారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #LifeStyle #Health #MentalHealth #Trauma #MentalTrauma #Depression
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.