ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలా? ఈ 4 విషయాలపై ఫోకస్ పెట్టాలంటున్న నిపుణులు!

Header Banner

ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలా? ఈ 4 విషయాలపై ఫోకస్ పెట్టాలంటున్న నిపుణులు!

  Mon Sep 30, 2024 16:52        Life Style

ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అనుకోకుండా శారీరక, మానసిక ఇబ్బందులు సంభవిస్తుంటాయి. అయితే వీటికి చాలా వరకు ఎవరికి వారే కారణం అవుతుంటారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా జీవన శైలిలో ప్రతికూల మార్పులు, పోషకాహార లోపాలు, క్షణం తీరికలేని పని పరిస్థితులు, నిరంతర ఆందోళనలు, సమయానికి తినకపోవడం, ఫిజికల్ యాక్టివిటీస్కు దూరంగా ఉండటం వంటివి ఇందులో భాగంగా ఉంటున్నాయి. ఇవి సహజంగానే ఆరోగ్యాన్ని, ఆనందాన్ని దూరం చేస్తుంటాయి. కాగా ప్రస్తుతం ఈ సమస్యలను ఎదుర్కొంటున్నవారిలో ఎక్కువ మంది గృహిణులే ఉంటున్నారని నిపుణులు చెప్తున్నారు.

 

జీవితంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని సమస్యలను దూరం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు నాలుగు విషయాలపై దృష్టి పెట్టాలని చెప్తున్నారు. అలాంటి వాటిలో ఫిజికల్ యాక్టివిటీస్, క్వాలిటీ స్లీప్, మెడికల్ టెస్టులు, సరైన పోషకాహారం వంటివి ఉన్నాయి. వీటిని రెగ్యులర్గా అమలు చేస్తే అనేక వ్యాధులను నివారించవచ్చునని, శరీరంలో వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం కాకుండా అడ్డుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే మానసిక వికాసానికి, ఫిజికల్ ఫిట్నెస్కు కూడా ఇవి చాలా ముఖ్యం.

 

ఇంకా చదవండిప్రాజెక్టుల పేరుతో ప్రజల ఇళ్లను కూల్చవద్దు! సీఎం దృష్టికి తీసుకువెళ్లిన హైడ్రా సమస్య! 

 

ఫిజికల్ యాక్టివిటీస్ : ఇంటి పనుల్లో, కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమవుతూ ఇప్పటికీ మహిళలు తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటున్నవారు చాలా మందే ఉంటున్నారు. సమయానికి తినకపోవడంతోపాటు శారీరక వ్యాయామాలకు దూరంగా ఉండటం వారిలో అనారోగ్యాలకు కారణం అవుతోంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవల్స్ అదుపులో ఉంటాయని, బీపీ, మధుమేహం, గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుందని చెప్తున్నారు. వారానికి కనీసం 4 నుంచి 5 రోజులు ప్రతిరోజూ 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకు తగిన ఆహార నియమాలు పాటించాలి.

 

క్వాలిటీ స్లీప్ : అధునిక జీవనశైలిలో మహిళలను వేధిస్తున్న మరో సమస్య నిద్రలేమి లేదా నాణ్యమైన. నిద్రలేకపోవడం. రకరకాల ఆలోచనలు, ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు ఇందుకు దారితీస్తున్నాయి. కుటుంబంలో ఇతరులకు అనారోగ్యాలు వంటి సందర్భాలు కూడా గృహిణులను ఎక్కువగా కృంగదీస్తున్నాయి. కుటుంబంలోని ఎవరికి అనారోగ్యం చేసినా మహిళలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని కారణంగా వారు నాణ్యమైన నిద్రకు దూరం అవుతున్నారు. చివరకు అనారోగ్యాల బారినపడుతున్నారు. సమస్యలు సహజమే. కానీ ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయం కూడా గుర్తుంచుకుంటే ఆందోళనలు దూరం అవుతాయని, తద్వారా నాణ్యమైన నిద్ర సాధ్యం అవుతుందని నిపుణులు చెప్తున్నారు.

 

ఇంకా చదవండిగల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మెడికల్ టెస్టులు : చాలా మంది గృహిణులు తమకు వచ్చే శారీరక సమస్యలను చిన్నవిగా భావించి పట్టించుకోరు. చివరికి అవి పెద్ద అనారోగ్య సమస్యలుగా మారుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్లు, లివర్ సమస్యలు, మధుమేహం వంటివి పెరిగిపోవడానికి వాటిని ప్రాథమిక దశలో గుర్తించకపోవడమే. కారణం అవుతోంది. కాబట్టి శరీరంలో ఏవైనా అనారోగ్య సూచనలు వారానికి మించి కనిపిస్తే వాటి నిర్ధారణకోసం మెడికల్ టెస్టులు చేయించుకోవాలని, తద్వారా ఏదైనా సమస్య ఉంటే అది పెరగకముందే నివారించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

పోషకాహారంపై ఫోకస్ : గృహిణులు చేసే పొరపాట్లలో సరైన పోషకాహారం తీసుకోవడం కూడా ఒకటి. ఇంటిల్లిపాది రుచికరమైన వంటకాలు చేసి పెట్టడం, కుటుంబాన్ని చూసుకోవడం, పనులు చక్కబెట్టడం ఇవన్నీ సక్రమంగా చేస్తున్న మహిళలు తాము మాత్రం సమయానికి తినడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. కొందరు సమయానికి తింటున్నా సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం చివరికి వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాబట్టి ఈ విషయాలపై ఫోకస్ పెట్టాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, అప్పుడే ఆరోగ్యాంగా, ఆనందంగా జీవించడం సాధ్యం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ బదిలీ! ఎందుకో తెలుసా?

 

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!

 

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితేఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!

 

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #LifeStyle #Health #MentalHealth #Trauma #MentalTrauma #Depression