తస్మాత్ జాగ్రత్త! మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? కిడ్నీల్లో ఏదో సమస్య ఉన్నట్టే!

Header Banner

తస్మాత్ జాగ్రత్త! మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? కిడ్నీల్లో ఏదో సమస్య ఉన్నట్టే!

  Sat Sep 28, 2024 11:45        Health

బాగా జలుబు చేసినప్పుడు దానిని గుర్తించదగ్గ సంకేతాలు మీ శరీరంలో కనిపిస్తుంటాయి. జ్వరం వచ్చినప్పుడు లేదా రాబోయే ముందు కూడా కొన్ని మార్పులు సంభవిస్తాయి. అలాగే మీరు కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే గనుక అందుకు సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తాయని, వెంటనే జాగ్రత్త పడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం పెరుగుతుందని చెప్తున్నారు. అలాంటి సింప్టమ్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

 

కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. మొత్తం ఆరోగ్యంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. రక్తంలోని మలినాలను, వ్యర్థాలను వడబోసి మూత్ర విసర్జన రూపంలో బయటకు పంపడంలో కీ రోల్ పోషిస్తాయి. అట్లనే సోడియం, పొటాషియం, కాల్షియం వంటి రసాయనాల లెవల్స్ను సమతుల్యం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

 

ఇంకా చదవండిపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ల నియామకంలో ఏపీకి ప్రాధాన్యత! నిధుల కోసం నూతన కమిటీలు! 

 

అలసట : రక్తాన్ని వడబోసి అవసరం లేని వ్యర్థాలను, విషపదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించడంలో కిడ్నీలు బాధ్యత వహిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేగనుక సరిగ్గా పనిచేయకపోతే బాడీలో టాక్సిన్లు పేరుకుపోతాయని, ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో వైఫల్యం చెందుతాయని అంటున్నారు. అంతేకాకుండా శరీరానికి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందకపోవడంతో తరచుగా అలసిపోతుంటారు.

 

యూరిన్లో రక్తం: మూత్ర విసర్జన సమయంలో రక్తం పడుతున్నా, ఎక్కువగా నురుగు వస్తున్నా అది మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయడం లేదనే సంకేతంగా అనుమానించాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మూత్రం గోధుమ రంగులోకి లేదా లైట్ కలర్లోకి మారిపోతుంది. ఈ పరిస్థితిలో యూరిన్తోపాటు బ్లడ్ రావచ్చు. కిడ్నీల్లో రాళ్లు, కణితులు, ఇన్ఫెక్షన్లు ఉన్నా రక్తం లీక్ అయ్యే అవకాశం ఉంటుంది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కండరాల బలహీనత, తిమ్మిరి : కండరాల బలహీనత, తరచుగా తిమ్మిరి పట్టడం వంటి లక్షణాలు మూత్ర పిండాల పనితీరు సరిగ్గా లేదనే సంకేతాలను సూచిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అలాంటప్పుడు నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. కండరాల ద్రవ్యరాశి తిబ్బతింటుంది. ఫలితంగా తిమ్మిర్లు ఎక్కువగా రావచ్చు. మీలో ఈ ప్రాబ్లం ఉన్నట్లు గమనిస్తే డాక్టర్లను సంప్రదించడం మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఇక మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. క్యాలీ ఫ్లవర్, రెడ్ బెల్ పెప్పర్స్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బెర్రీలు, యాపిల్స్ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!

 

జగన్ కు వరుసగా మరో షాక్! మీటింగ్ పెట్టి బ్రతిమిలాడుకుంటున్నా నో యూజ్! మరో ప్రముఖ మాజీ ఎమ్మెల్యే గుడ్ బాయ్!

 

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!

 

అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!

 

నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారుఎవరు?

 

అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #Health# #Kidneys #LifeStyle #HealthyBody #HealthyFood #Diet