వైట్ బ్రెడ్ తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?

Header Banner

వైట్ బ్రెడ్ తినడం వల్ల డయాబెటిస్ వస్తుందా? డాక్టర్లు ఏం చెప్తున్నారు?

  Mon Jan 06, 2025 20:27        Health

ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అంతేకాకుండా బ్రెడ్ ఆమ్లెడ్, బ్రెడ్ పకోడా, బ్రెడ్ జామ్ రకరకాలు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. అయితే, ఓ యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం వస్తుందని పేర్కొన్నారు. ఇందులో నిజనిజాలు తెలుకోవడానికి నిపుణుల్ని సంప్రదించడం జరిగింది. వారు ఏం చెప్పారంటే..

 

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక, మనం తినే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్స్ కూడా ఉన్నాయి. అందుకే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే కచ్చితంగా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. ఇక, ఈ రోజుల్లో డయాబెటిస్, ఊబకాయం సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. 

 

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అయితే, వైట్ బ్రెడ్‌ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వైట్ బ్రెడ్ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వస్తాయని ఓ యూట్యూబ్ వీడియోలో ఉంది. ఈ విషయంపై నిపుణులు ఏం చెప్పారో తెలుసుకుందాం. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి ప్రమాదమని తెలిపారు. వైట్ బ్రెడ్‌ని 100 శాతం మైదాతో తయారు చేస్తారని.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. వీటిని తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు పెరుగుతుందని తెలిపారు. వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ లేదంటే ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి ఇంటి టిఫెన్స్ చేయడం మేలని పేర్కొన్నారు. అంతేకానీ వైట్ బ్రెడ్‌తో పకోడా, జామ్‌తో తినడం, బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి తినవద్దని తెలిపారు. అయితే, ఇందులో నిజమెంత? డాక్టర్ ఏం చెప్పారు? 

 

వైట్ బ్రెడ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయని.. ఇందులో పోషకాలేమీ లేవని డాక్టర్లు చెప్తున్నారు. వైట్ బ్రెడ్‌లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్లో ఆకస్మిక మార్పులకు కారణమన్నారు. వైట్ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ తగ్గుతుంది. దీంతో టైప్ -2 డయాబెటిస్ వస్తుందని తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆకలి పెరుగుతుందని.. దీంతో కొవ్వు స్థాయిలు పెరిగి ఊబకాయం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.

 

చివరికి ఏం తేలిందంటే.. యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం దాదాపు నిజమని తేలింది. వైట్ బ్రెడ్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు తెలిపారు. వైట్ బ్రెడ్ బదులు గింజలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారంలో చేర్చుకోవాలని వారు పేర్కోన్నారు

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా ప్రజలకు ప్రభుత్వం భారీ హెచ్చరిక! ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర..! జాగ్రత్తలు తీసుకోకపోతే ఇక అంతే.. 

 

పిన్నెల్లికి మరో షాక్! హైదరాబాద్ లో ప్రధాన అనుచరుడు అరెస్ట్! 

 

ఏపీలో కలకలం.. ఇంట్లో నుంచి వెళ్లిన ఇద్దరు బాలికలు మిస్సింగ్! 

 

ఇచ్చిన మాట వెంటనే నిలబెట్టుకున్న లోకేశ్! కొన్ని గంటల్లోనే సీసీ కెమెరాలు.. 

 

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన! ఎప్పుడుఎందుకు..? 

 

లోకేశ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు భారీ శుభవార్త! ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. అకౌంట్లోకి డబ్బులుచెల్లింపు ఇలా! 

 

పవన్ కల్యాణ్ గారే రియల్ గేమ్ చేంజర్! ర్యాలీ గుర్తొస్తోందన్న రామ్ చరణ్.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #Diabetes #SugarLevels #BloodSugar #DiabetesPatients