వ్యాయామం చేస్తున్నారా? అయితే ఈ టీల‌ను తాగండి! ఆరోగ్యంగా ఉంటారు!

Header Banner

వ్యాయామం చేస్తున్నారా? అయితే ఈ టీల‌ను తాగండి! ఆరోగ్యంగా ఉంటారు!

  Thu Jan 09, 2025 14:15        Health

రోజూ ఉద‌యాన్నే చాలా మందికి నిద్ర లేవ‌గానే టీ తాగే అల‌వాటు ఉంటుంది. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడి వేడిగా టీ తాగుతుంటే వ‌చ్చే మ‌జాయే వేరు. చాలా మందికి ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే టీ తాగ‌క‌పోతే రోజును ప్రారంభించిన‌ట్లు సంతృప్తి ఉండ‌దు. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఉద‌యం మొద‌ట‌గా టీ సేవిస్తుంటారు. అయితే సాధార‌ణ టీని రోజుకు ప‌రిమిత మోతాదులోనే తాగాలి. అధికంగా సేవిస్తే టీలో ఉండే కెఫీన్‌, టానిన్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. కానీ రోజూ హెర్బ‌ల్ టీల‌ను సేవిస్తే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. సాధార‌ణ టీకి బ‌దులుగా హెర్బ‌ల్ టీల‌ను సేవిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాయామం చేసిన అనంత‌రం ఈ హెర్బ‌ల్ టీల‌ను సేవించాల్సి ఉంటుంది. దీంతో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

 

గ్రీన్ టీ..
వ్యాయామం చేసిన వెంట‌నే లేదా శారీర‌క శ్ర‌మ చేసిన వెంట‌నే హెర్బ‌ల్ టీల‌ను సేవించ‌డం ఉత్త‌మం. ముఖ్యంగా గ్రీన్ టీని సేవించాలి. ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీని సేవించ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చవుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. ఎంత ప‌నిచేసినా అంత సుల‌భంగా అల‌సిపోరు. దీంతో బ‌ద్ద‌కం పోతుంది. రోజంతా శ‌క్తి స్థాయిలు అలాగే ఉంటాయి. అలాగే వ్యాయామం చేసిన అనంత‌రం బ్లాక్ టీని కూడా సేవించ‌వ‌చ్చు. అయితే ఇందులో చ‌క్కెర క‌ల‌ప‌కుండా తాగితే మేలు జ‌రుగుతుంది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

బ్లాక్ టీ..
బ్లాక్ టీలోనూ అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వ్యాయామం చేసిన అనంత‌రం బ్లాక్ టీని సేవిస్తుంటే తిరిగి శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా చురుగ్గా ప‌నిచేయ‌వ‌చ్చు. బ్లాక్ టీ వ‌ల్ల శ‌రీరంలో నైట్రిక్ ఆమ్లం ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఇది శ‌క్తిని అందిస్తుంది. అందువ‌ల్ల ఎంత ప‌నిచేసినా అల‌స‌ట రాదు. చురుగ్గా ఉంటారు. ఇక వ్యాయామం చేసిన త‌రువాత తాగాల్సిన టీల‌లో అల్లం టీ కూడా ముఖ్య‌మైన‌ది. అల్లంను నీటిలో వేసి మ‌రిగించి వ‌డక‌ట్టి తాగుతుండాలి. అవ‌స‌రం అనుకుంటే అందులో కాస్త తేనె క‌లుపుకోవ‌చ్చు. అల్లం టీని సేవించ‌డం వ‌ల్ల మెట‌బాలిజం పెరిగి కొవ్వు క‌ర‌గ‌డ‌మే కాదు, జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.

 

హెర్బ‌ల్ టీలు..
ఇవే కాకుండా మార్కెట్‌లో మ‌న‌కు ప‌లు హెర్బ‌ల్ టీలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు క‌మోమిల్ టీ, మందార పువ్వుల టీ, గులాబీ పువ్వుల టీ, పుదీనా టీ, తుల‌సి ఆకుల టీ.. ఇలా ర‌క‌ర‌కాల హెర్బ‌ల్ టీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏ టీని అయినా సేవించ‌వ‌చ్చు. ఇవి మెట‌బాలిజంను పెంచి కొవ్వును క‌రిగేలా చేస్తాయి. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. ముఖ్యంగా వ్యాయామం చేసిన అనంత‌రం ఈ టీల‌ను సేవిస్తుంటే కోల్పోయిన శ‌క్తిని తిరిగి పొందుతారు. దీంతో రోజంతా శ‌క్తి స్థాయిలు త‌గ్గ‌కుండా అలాగే ఉంటాయి. ఉత్సాహంగా, చురుగ్గా ప‌నిచేసుకోవ‌చ్చు. అలాగే రోగాలు రాకుండా కూడా ఈ టీలు మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. క‌నుక ఈ టీల‌ను రోజూ తాగితే మంచిది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #Tea #GreenTea #BlackTea #HerbalTea #Exercise #WorkOut