అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!

Header Banner

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!

  Sat Jun 22, 2024 08:00        U S A

ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్కార్డు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై మీ ప్రణాళికలేంటని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై ఫైర్ అయ్యే ట్రంప్, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గ్రాడ్యుయేట్ కాగానే అమెరికాలో ఉండేందుకు వీలుగా డిప్లొమాతో పాటే నేరుగా గ్రీన్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అది రెండేళ్లు, నాలుగేళ్లు, ఇలా వ్యవధితో సంబంధం లేదన్నారు. జూనియర్ కాలేజ్ లకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారిస్తానని ట్రంప్ ప్రకటించారు. కరోనా వల్ల ఈ విదానాన్ని గతంలో అమలు చేయలేకపోయానని తెలిపారు. వీసా సమస్యల వల్ల భారత్, చైనా నుంచి వస్తున్న చాలామంది అమెరికాలో ఉండలేకపోతున్నారని అన్నారు. రెండోసారి అధ్యక్ష పీఠం కోసం ట్రంప్ బరిలో ఉన్నారు. అయితే, ఈసారి మాత్రం గతంలో చేసిన వాటికి భిన్నంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. అక్రమ వలసదారులు దేశంలో నిరుద్యోగం, హింస, నేరాలు, వనరుల దోపిడీకి కారణమవుతున్నారని చాలా సందర్భాల్లో విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వస్తే వారందరినీ తిప్పి పంపిస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఈసారి మాత్రం దానికి విరుద్ధంగా హామీలు ఇస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్! 

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే! 

 

శాసన సభకు రాకూడదని నిర్ణయించుకున్న జగన్! రేపు పులివెందుల పర్యటన! 

 

బాపట్ల జిల్లా: చీరాల రామాపురం బీచ్ లో అలల ఉద్రిక్తత! నలుగురు యువకులు గల్లంతు! 

 

జగన్ ఇప్పుడు సీఎం కాదు కాబట్టి బిజీగా లేరు! కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి! 

 

శాసనసభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేడు! మూగబోయిన వై నాట్ 175 నినాదం! 

 

శాసనసభ రేపటికి వాయిదా! స్పీకర్ ఎన్నిక అప్పుడే! 

 

లిక్కర్ కేసులో కవితకు తప్పని తిప్పలు! జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు! 

                  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants