అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

Header Banner

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

  Thu Jun 27, 2024 21:01        U S A

అమెరికాలో తెలుగు ప్రజల సంఖ్య భారీగా పెరుగుతోంది

తెలుగు రాష్ట్రాల నుంచి చదువు, ఉద్యోగాల కోసం చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా అమెరికాను తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నారు. 2016లో 3,20,000 మంది తెలుగువారి సంఖ్య 2024 నాటికి 1.23 మిలియన్లకు పెరిగింది. యూఎస్ లో అత్యధికంగా మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉంది. అత్యధికంగా మాట్లాడే భారతీయ భాషలలో హిందీ, గుజరాతీ తర్వాత తెలుగు 3వ స్థానంలో ఉంది. US సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం, ఈ పెరుగుదలలో నాలుగో తరం వలసదారులు, ఇటీవల వచ్చిన విద్యార్థులు ఉన్నారు. కాలిఫోర్నియాలో 2 లక్షల మంది, టెక్సాస్లో 1,50,000 మంది, న్యూజెర్సీలో 1.10 లక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

 

ఇంకా చదవండి: USA: లాస్ వెగాస్‌లో చోటుచేసుకున్న ఘటన! ఐదుగురిని కాల్చిచంపిన 50 ఏళ్ల వ్యక్తి! తీవ్రంగా గాయపడ్డ 13 ఏళ్ల బాలిక!

 

2010-2017 మధ్యకాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 86% పెరిగిందని అమెరికన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ పేర్కొంది. 2010లో 4 లక్షల మంది తెలుగు మాట్లాడేవారైతే, ఇప్పుడు వారి సంఖ్య మరింతగా పెరిగింది.

ప్రతీ ఏడాది 60,000-70,000 మంది విద్యార్థులు తెలుగు ప్రాంతాల నుండి అమెరికాకు వెళ్తున్నారు. 10,000 మంది H-1B వీసా కింద వస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రకారం, కొత్తగా వచ్చిన వారిలో 80% తమ సంస్థలో నమోదు చేసుకున్నారు. వారిలో 75% మంది డల్లాస్, బే ఏరియా, నార్త్ కరోలినా, న్యూ జెర్సీ, అట్లాంటా, ఫ్లోరిడా, నాష్విల్లే వంటి నగరాల్లో స్థిరపడ్డారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల్లో 12.5% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నారు. కెంట్ స్టేట్ యూనివర్సిటీల్లో కొత్త విద్యార్థులకు తెలుగులో స్వాగతం చెబుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

ఇంకా చదవండి: జూన్ 30 అర్థరాత్రి నుండి IPC చట్టాలకు విరామం! జులై 1 నుండి కొత్త క్రిమినల్ చట్టాలు అమలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా! శామ్ పిట్రోడా తిరిగి నియామకం!

 

జియో AirFiber సేవలు విస్తరణ! రూ. 101 నుంచి రూ. 401 వరకు! ఫైబర్ సేవలతోపాటు అదనపు డేటా సాచెట్ ప్యాక్స్ లాంచ్!

 

శాంసంగ్ నుంచి తొలిసారిగా మ్యూజిక్ ఫ్రేమ్ లాంచ్!  సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది! ఎక్కడ కొనుగోలు చేయాలి?

 

ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానానికి రాజమౌళి దంపతులు! ఆహ్వానం అందుకున్న భార‌తీయ‌ సెల‌బ్రిటీల్లో!

 

ఇంత తక్కువ ధరకే మొబైల్ ఫోన్ వస్తుంది అంటే నమ్ముతారా! Realme C61 అదిరే ఫీచర్స్‌తో భారత మార్కెట్లోకి రాబోతోంది!

 

అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులను జగన్ ఒప్పుకోవాలి! ఆచంట సునీత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీ కేబినెట్ తొలి సమావేశం! రాజధాని, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ!

 

2024లో ఆపిల్ నుండి iPhone 16 సిరీస్! ధర, విడుదల తేదీ వివరాలు!

 

ఉత్తరప్రదేశ్‌లో డీఎస్పీ ర్యాంకు నుంచి! కానిస్టేబుల్ ర్యాంకుకు దిగజారిన అధికారి!

 

చంద్రబాబు స్పెషల్ టీం 19 IAS లు! శ్రీలక్ష్మి కి మొండి చెయ్యి! ఆ నలుగురికి శిక్ష తప్పదా!

 

మీ వద్ద తెల్ల రేషన్ కార్డు ఉందా! కేంద్రప్రభుత్వ పథకాలన్నీ ఉపయోగించుకుంటున్నారా?

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:                           

Whatsapp group

Telegram group

Facebook group


   #Andhrapravasi #TeluguInAmerica #TeluguCommunity #TeluguPride #USATeluguPopulation #Migration #TeluguLanguage #TeluguCulture #TeluguStudents #USA