తప్పంతా నాదే.. ట్రంప్‌తో బహిరంగ చర్చలో వైఫల్యంపై బైడెన్! ఈ విశ్రాంతి సరిపోలేదా?

Header Banner

తప్పంతా నాదే.. ట్రంప్‌తో బహిరంగ చర్చలో వైఫల్యంపై బైడెన్! ఈ విశ్రాంతి సరిపోలేదా?

  Sun Jul 07, 2024 15:30        U S A

అమెరికా అధ్యక్ష ఎన్నిక బరిలో నిలిచిన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన టీవీ చర్చలో తాను తడబడటం, విఫలమవడంపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ పరిస్థితికి తానే కారణమని, వైఫల్యానికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అంతకుముందు, విస్కాన్సిన్ లోని మాడిసన్ నగరంలో జరిగిన డెమాక్రటిక్ పార్టీ ర్యాలీలో బైడెన్ పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో ముచ్చటించారు. ఆ రాత్రి టీవీ చర్చలో తాను విఫలమయ్యానని బైడెన్ అంగీకరించారు. అయితే, దీని వెనక తీవ్రమైన అనారోగ్య కారణమేమీ లేదని స్పష్టం చేశారు.

 

ఇంకా చదవండి: ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

 

అప్పటికే బాగా అలసిపోయినా, మనసు మొరాయిస్తున్నా వినకుండా చర్చలో పాల్గొని విఫలమయ్యానని అన్నారు. ట్రంప్‌తో చర్చకు ముందు ఫ్రాన్స్ పర్యటన నుంచి వచ్చిన బైడెన్ క్యాంప్ డేవిడ్‌లో రెస్టు తీసుకున్న విషయాన్ని యాంకర్ ప్రస్తావించారు. ఈ విశ్రాంతి సరిపోలేదా? అని ప్రశ్నించారు. అప్పటికే తాను బాగా బడలికతో ఉన్నానని, అసలేమాత్రం ఉత్సాహంగా లేనని బైడెన్ చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షల్లో కొవిడ్ వ్యాధి లేదని వచ్చినా తీవ్రమైన జలుబు ఉందని చెప్పారు. చర్చకు సంబంధించి టీవీ ఫుటేజీని తాను ఇప్పటివరకూ చూడలేదని కూడా బైడెన్ చెప్పారు. కానీ, అది నిరాశపరిచేదిగా ఉందన్న విషయం తనకు తెలుసని అన్నారు.

 

ఇంకా చదవండి: ఇస్రో అగ్నికుల ప్రయోగం విజయవంతం! 6 కిమీ ఎత్తుకు రాకెట్! ISRO కు మరో మైలురాయి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం!

 

ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు! ఎంతో తెలుసా?

 

7న హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన సన్మానం! ఎందుకో తెలుసా?

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా!

 

కువైట్ లోని గృహ కార్మికులకు శుభవార్త! ఆనందంలో ప్రవాసులు!

 

ఆస్ట్రేలియా పార్లమెంట్ పైకప్పుపై నిరసన! అనుకూల మద్దతుదారులు అరెస్ట్!

 

WhatsAppలో కొత్త ఫీచర్! మీ ఫోటో నుండి AI అవతార్ ని ఇలా సృష్టించండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #JoeBiden #DonaldTrump #USA #Debate