ప్రముఖ తెలుగువారి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు! స్పీకర్ అయ్యన్నపాత్రుడి ప్రత్యేక హాజరు!

Header Banner

ప్రముఖ తెలుగువారి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు! స్పీకర్ అయ్యన్నపాత్రుడి ప్రత్యేక హాజరు!

  Sun Sep 29, 2024 09:21        U S A

గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, గోల్డెన్ జూబ్లీ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, సంఘ సభ్యులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు సతీమణి చింతకాయల పద్మావతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో తెలుగు సమాజం సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులు మరియు సంఘ సభ్యులు అనేక విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు సంఘాన్ని ఆహ్వానించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ, సంఘం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


ఇంకా చదవండి: గల్ఫ్ లో ఏజెంట్ మాయమాటలు విని మోసపోయిన తెలంగాణ యువతి! కఠినమైన చట్టాలు లేకనే! ప్రభుత్వ సహాయం కోసం! 9 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విదేశాల్లో ఉన్నప్పటికీ ఇంత ఘనంగా నిర్వహించడం గర్వకారణం. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిని ఒక్కటి చేయడానికి ఇలాంటి సంఘాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి" అన్నారు.

ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలు రెండు రోజుల పాటు జరగగా, ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గ్యాస్ ధరల్లో మార్పులు! అక్టోబర్‌ నుంచి అమల్లోకి వచ్చే మార్పులు ఇవే! 

 

ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి! చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు! 

 

ఆంధ్రులకు సంతోషాన్ని కలిగించే శుభవార్త! భారీ పెట్టుబడులతో తిరిగి రానున్న లులు (LULU)! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. చంద్రబాబుతో కంపెనీ యజమాని! 

 

సీఎం చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత భేటీ! రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక చర్చ! 

 

తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఏమిటీ సమస్య? నిబంధనల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 




   #andhrapravasi #washigton #goldenjublie #america #usa #todaynews #flashnews #latestupdate