డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రధాని ట్రూడోతో కీలక భేటీ! వాణిజ్య సంక్షోభంలో కొత్త మలుపు!

Header Banner

డొనాల్డ్ ట్రంప్ కెనడా ప్రధాని ట్రూడోతో కీలక భేటీ! వాణిజ్య సంక్షోభంలో కొత్త మలుపు!

  Sun Dec 01, 2024 17:41        U S A

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్  కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకం విధించనున్నట్లు చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై చర్చించేందుకు కెనడా  ప్రధాని జస్టిన్ ట్రూడో  ట్రంప్తోతో భేటీ అయ్యారు. ఫొరెడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్ ఈ భేటీకి వేదికైంది. ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 'నేను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో సమావేశమయ్యాను. ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి అవసరమైన అనేక అంశాలపై మాట్లాడుకొన్నాం. అక్రమ వలసలు, ఫెంటనిల్ స్మగ్లింగ్ అంశాలు చర్చకు వచ్చాయి. అమెరికా కార్మికులకు నష్టం కలిగించని వాణిజ్యపరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకొన్నాం.



ఇంకా చదవండినామినేటెడ్ పోస్టుల మరో లిస్టు విడుదల?? పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతున్న ఉత్కంఠ.. అసహనం!



చైనా నుంచి వస్తున్న ఫెంటనిల్ కారణంగా మా పౌరులు మాదకద్రవ్యాలకు బాధితులుగా మారడాన్ని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశా. ఈ భయంకరమైన వినాశనాన్ని అంతం చేసేలా ట్రూడో మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు' అని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ట్రూడో ఎక్స్ వేదికగా వెల్లడించారు. గతేడాది కెనడా నుంచి అమెరికాకు దాదాపు 423 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. వీటిపై 20 లక్షల మంది కెనడా వాసుల ఉద్యోగాలు ఆధారపడ్డాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చాక కెనడా, మెక్సికోలపై అధిక సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. చైనా నుంచి దిగుమతులపైనా 10 శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలు
వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనంగోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారాఅలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారుఅసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు!

 

వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. వారంతా జైలుకు వెళ్ల‌డం ఖాయం - గుట్టును రట్టు చేసిన RRR!

 

ఈ నెల 30 నుంచి '6 అబద్ధాలు 66 మోసాలుపేరుతో బీజేపీ నిరసన! కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు!

 

గుడ్ న్యూస్: 30 శాతం సబ్సిడీతో మహిళకు రూ. లక్షలు! నెలకు ఎంత కట్టాలంటేఅసలు విషయం ఇదే!

 

శుభవార్త చెప్పిన చంద్రబాబు.. 10,000 మందికి ఉద్యోగాలు! ఆ జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు!

 

పెన్షన్ దారులకు పండగే పండగ.. ఒకరోజు ముందుగానే పెన్షన్ డబ్బులు! కొన్ని కీలక మార్పులు - కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

 

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు నోటిఫికేషన్‌ జారీ! ఎప్పటినుంచి అంటే!

 

కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌తో పవన్ కల్యాణ్ భేటీ! పర్యాటక ప్రాజెక్టులువర్సిటీపై కీలక చర్చలు!

 

నిన్నటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ..తెలంగాణతమిళనాడులో పోలీసుల గాలింపు! ఈరోజు ఏపీ హైకోర్టులో..

 

భారతీయులకు భారీ షాక్: అమెరికా వెళ్లే కల ఆగిపోయినట్టేనా - 11వేల మంది ఉద్యోగాలు కట్! రాబోయే రోజుల్లో ఈ వీసాలుఇంక దక్కవని!

 

శుభవార్త చెప్పేసిన సీఎం.. ఇక రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్యుత్! 100 శాతం సౌర విద్యుత్ వినియోగం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #america #donaldtrump #trudeau #bheti #tariff #todaynews #flashnews #latestupdate