అప్పటిలోపు వారిని విడుదల చేయకపోతే! హమాస్‌కు ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌!

Header Banner

అప్పటిలోపు వారిని విడుదల చేయకపోతే! హమాస్‌కు ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌!

  Tue Dec 03, 2024 11:13        U S A

ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్‌కు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్‌ ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని అల్టిమేటం జారీ చేశారు.

 

లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేదంటూ నరకం చూస్తారని, గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా, గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం దాదాపు 200 మందికిపైగా ప్రజలను హమాస్‌ బంధించి గాజాలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా కొందరిని విడుదల చేసింది. బంధీల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 51 మంది సజీవంగా ఉన్నారు. 

 

బందీలకు సంబంధించిన వీడియో హమాస్‌ మిలిటరీ విభాగం ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో అమెరికా – ఇజ్రాయెల్‌ జాతీయుడైన 20 ఏళ్ల ఎడాన్‌ అలెగ్జాండర్‌ మాట్లాడుతూ.. మమ్మల్ని హమాస్‌ చెర నుంచి త్వరగా విడిపించండి అంటూ వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియోపై ట్రంప్‌ పై విధంగా స్పందించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

నేడు (3/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! 

 

తస్మా జాగ్రత్త.. మీ ఇంట్లో గీజర్ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి! లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

 

రూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!

 

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

సంక్షేమ పథకాలపై మార్పులుచేర్పులు సీఎం సంచలన నిర్ణయం! ఇకపై ప్రతి ఒక్కరికీ ఆ అవకాశం - ఈ కార్యక్రమం ద్వారా.. 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants