అమెరికాలో కార్చిచ్చు బీభత్సం! మంటల్లో హాలీవుడ్‌ సెలబ్రిటీల ఇళ్ళు! హెచ్చరికలు జారీ!

Header Banner

అమెరికాలో కార్చిచ్చు బీభత్సం! మంటల్లో హాలీవుడ్‌ సెలబ్రిటీల ఇళ్ళు! హెచ్చరికలు జారీ!

  Thu Jan 09, 2025 10:39        U S A

సంపన్నుల నగరంగా పేరొందిన లాస్‌ ఏంజెల్స్‌ను కార్చిచ్చు వణికించింది. బిలియనీర్లు నివసించే పసిఫిక్‌ పాలిసేడ్స్‌తో పాటు పలు చోట్ల మంగళ, బుధవారాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. ఈ కార్చిచ్చు బారిన పడి ఇద్దరు మృతి చెందగా, చాలామంది గాయపడ్డారు. 3 వేలకు పైగా విస్తీర్ణంలో ఉన్న 10 వేలకు పైగా ఇండ్లు మంటల్లో చిక్కుకోగా అందులో వెయ్యికి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు లాస్‌ ఏంజెల్స్‌ కౌంటీ ఫైర్‌ చీఫ్‌ ఆంటోని మార్రోన్‌ తెలిపారు. మెట్రోపాలిటన్‌లో మూడు వేర్వేరు ప్రాంతాలు మంటల్లో చిక్కుకున్నాయన్నారు.

 

వేలాది మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. మంటలను ఆర్పడానికి విమానాలు, హెలికాప్టర్లు, బుల్డోజర్లతో సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ప్రమాదంలో శాంటామోనికా ప్రాంతంలో ఖరీదైన ఇళ్లు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిబూడిదయ్యాయి. చాలా మంది తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోయిన వారిలో పలువురు బిలియనీర్లతో పాటు హాలీవుడ్‌ సెలబ్రిటీ జేమ్స్‌ ఉడ్స్‌, స్టీవ్‌ గుటెన్‌బర్గ్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడింది.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కట్టుబట్టలతో కాలినడకన..
వేలాదిమంది బాధితులు తమ ఇళ్లలో నుంచి కట్టుబట్టలతో బయటపడిన దృశ్యాలు ఈ ప్రమాదం సందర్భంగా చోటుచేసుకున్నాయి. కళ్లముందే తమ గృహాలు కాలి భస్మీపటలం కావడాన్ని పలువురు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. ఇళ్ల ముందే వందలాది ఖరీదైన కార్లు కాలిబూడిదగా మారాయి. కొంతమంది కార్లలోంచి బయటకు వచ్చినా ట్రాఫిక్‌ జామ్‌లో ముందుకు వెళ్లలేక వాటిని అక్కడే వదిలేసి కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడం కన్పించింది. ‘ఎన్ని కోట్లున్నా ప్రకృతి వైపరీత్యం ముందు అందరూ తలొంచాల్సిందే’ అని పలు వార్తా సంస్థలు ప్రత్యేక కథనాల్లో వివరించాయి. మొత్తం 2,921 ఎకరాలు ఉన్న ప్రాంతం కార్చిచ్చుకు గురైనట్టు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. విపత్తు రక్షక దళాలు ప్రమాద స్థలికి చేరుకోవడానికి వీలుగా దారికి అడ్డుగా ఉన్న వాహనాలను తొలగిస్తున్నారు.

 

భయపెట్టిన దృశ్యాలు..
ఆ ప్రాంతంలో ఉన్న వృద్ధుల సంరక్షణ కేంద్రం కూడా మంటల బారిన పడింది. దీంతో అందులో ఉన్న డజన్ల సంఖ్యలోని వృద్ధులను వీల్‌చైర్లు, హాస్పిటల్‌ బెడ్స్‌ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ అగ్నికీలలు చుట్టుముట్టగా, ఒక ఇంటిలో ఇద్దరు వ్యక్తులు ఒక పెంపుడు కుక్క చిక్కుకుపోయిన వీడియో భీతిగొలుపుతున్నది. కాగా, గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ రాష్ట్రంలో అత్యవసర స్థితిని ప్రకటించారు. . బెవర్లీ హిల్స్‌, హాలీవుడ్‌ హిల్స్‌, మలిబు, శాన్‌ఫెర్నాండో ప్రాంతాలకు కార్చిచ్చు ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants