దుబాయ్ లో వేడుకగా ఎన్టీఆర్ సినీవజ్రోత్సవం! ముఖ్య అతిదులుగా పాల్గొన్న టిడి. జనార్థన్, తణుకు MLA! ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఘనంగా..

Header Banner

దుబాయ్ లో వేడుకగా ఎన్టీఆర్ సినీవజ్రోత్సవం! ముఖ్య అతిదులుగా పాల్గొన్న టిడి. జనార్థన్, తణుకు MLA! ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఘనంగా..

  Mon Dec 23, 2024 09:46        U A E

యుఏఇ ఎన్.ఆర్.ఐ. టిడిపి ఆధ్వర్యంలో దుబాయ్ వేదికగా డిసెంబర్ 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ శ్రీ టి.డి. జనార్థన్, తణుకు నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ అరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.

దుబాయ్ లోని బిర్యానీమోర్ వేదికగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఇందులో ఎన్టీఆర్ టీడీపీ సభ్యులు, ఐక్య శెట్టి బలిజ సంఘం సభ్యులు, ఐక్య క్రిస్మస్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ... విదేశాలలో ఉంటూ కూడా స్వదేశం పట్ల అభిమానం చూపిస్తున్న ఎన్నారైల మాతృభూమి భక్తి గొప్పదన్నారు. క్రిందటేడాది జరిగిన ఎన్నికలలో శ్రీ నారాచంద్రబాబు నాయుడిగారి విజయం కోసం యుఏఇ నుంచి ఎందరో ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ కొచ్చి నెల రోజులకు పైగా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందరి సమష్ఠి కృషితోనే ఆంధ్రప్రదేశ్ లోమళ్లీ ప్రజాప్రభుత్వం ఏర్పాటయిందని, ప్రజల ఆకాంక్షల మేరకు ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ భాగస్వామి పార్టీల అధినేతలు శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి పురందేశ్వరిలు పని చేస్తున్నారన్నారు.

 

ఇంకా చదవండి: నేడు (23/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

క్రిస్మస్ కేక్ ను కట్ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని, క్రీస్తు ప్రవచించిన శాంతి, కరుణ, సామరస్యంతోనే మానవాభివృద్ధి సాధ్యం అవుతుందని శ్రీ టి.డి. జనార్థన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాసన సభ్యులు శ్రీ అరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు.

ఇక ఎన్నారై టీడీపీనేతలు నిర్వహించిన 'మీట్ అండ్ గ్రీట్' వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమాన్ని జరిపారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వెలువరించిన 'తారకరామం' పుస్తకాన్ని శ్రీ టి.డి. జనార్థన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య నటుడు, రాజకీయ నాయకుడైన నందమూరి తారకరామారావు గారి శతజయంతి సంవత్సరాన్ని క్రిందటేడాది ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఘనంగా జరుపుకున్నారని, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మొదలై 75 సంవత్సరాలైన సందర్భంగా ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్ని అన్ని చోట్ల జరుపుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అంగీకరించిన విషయాన్ని శ్రీ టి.డి. జనార్థన్ తెలియజేశారు.

ఈ వేడుకలలో పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన టీడీపీ యుఎన్ఐ అధ్యక్షుడు మోత్కురు విశ్వేశ్వరరావు, డాక్టర్ రవి గారు, కోడి రాజాకిరణ్, పాడిపిరెడ్డి దాసు, డాక్టర్ ముక్క తులసి కుమార్, ఖాదర్ బాషా, సామ్యూల్ రత్నం, కుడుపూడి సత్య, కేత శెట్టి, జుత్తుగ శ్రీను, కోడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో చాన్స్‌.. వారికి పంటల బీమా పథకాలు!

 

ప్రియురాలితో జెఫ్ బెజోస్ పెళ్లి! అంత ఖర్చు చేస్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలిస్తే అవాక్!!

 

దేశ రాజధాని ఢిల్లీలో TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం! సభ్యత్వంతో సరికొత్త రికార్డు!

 

డబ్బులు వడ్డీకి ఇస్తే జైలు శిక్షే మరియు జరిమానా! ప్రభుత్వం దిమ్మతిరిగే రూల్స్..

 

అల్లు అర్జున్‌ అరెస్ట్ ఎందుకు.. రేవంత్ రెడ్డి పై పురంధేశ్వరి షాకింగ్ కామెంట్స్!

 

ఏపీలో తగ్గిన మద్యం ధరలు! కొత్త రేట్లు చూస్తే.. బాటిల్ దింపరు! ప్రస్తుతం కొత్త మద్యం పాలసీ!

 

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి! విద్యార్థి సంఘాల ఆందోళన!

 

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మంత్రుల పేషీల్లో ఉద్యోగాలు.. జీతం రూ.50 వేలు!Don'tMiss

 

వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ! జగన్‌తో భేటీ - దీని కారణంగానే..

 

అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు! ఈ ఏడాది ఎంతమంది సిటిజెష్‌షిప్ పొందారో తెలిస్తే షాక్!

 

అల్లుఅర్జున్ కు ఊహించని షాక్! నేను చూస్తూ ఊరుకోను - సినీ ఇండస్ట్రీకి రేవంత్ హెచ్చరిక!

 

ఎస్‌బీఐలో 13735 ఖాళీలు! హైదరాబాద్‌ స ర్కిల్‌లో 342 పోస్టులు!

 

మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు!

 

నేడు (21/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరు, అప్లై చేసుకోండి ఇలా! ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #Program #YDPLeaders #UAE #NTRstatue