ఆంధ్రప్రదేశ్ లో మూతపడనున్న టీవీ9! దానికి కారణం ఏంటి?

Header Banner

ఆంధ్రప్రదేశ్ లో మూతపడనున్న టీవీ9! దానికి కారణం ఏంటి?

  Thu Jun 13, 2024 17:17        Others, Politics

20 ఏళ్లుగా తెలుగు మీడియాలో ఒక స్థానాన్ని సంపాదించుకున్న టీవీ9 తెలుగు ఇక మూతపడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడం, కేబుల్ ఆపరేటర్లు స్వచ్ఛందంగా టీవీ9 నీ నిలిపివేయడంతో కష్టాల్లో పడ్డ ఈ ఛానెల్ ని  ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా మోసివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇకపై టీవీ9 తెలంగాణ పేరుతో పూర్తిగా తెలంగాణకు మాత్రమే పరిమితం కానుంది. గత ఐదేళ్లుగా వైసీపీ భజన చేస్తూ వాళ్లు ఇచ్చే చిల్లరతో రజినీకాంత్ చేసిన చిల్లర వేషాలు, ప్రసారం చేసిన తప్పుడు కథనాలు జనాల్లో వెగటు పుట్టించాయి. ఆ ఛానెల్ పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోయింది.

 

ఇంకా చదవండి: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పూర్తి పనులు వేగవంతం! కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు!

 

రవిప్రకాష్ ను ఛానెల్ నుంచి బయటకు పంపినప్పుడే ఛానెల్ బ్రాండింగ్ అంతా పోయింది. అయితే రవిప్రకాష్ వల్ల వచ్చిన బ్రాండింగ్ టు ఇన్నాళ్ళు నెట్టుకొచ్చింది. రజనీకాంత్ చేతుల్లోకి వెళ్లాక పూర్తిగా నానమైపోయింది. ఇపుడు రోడ్ల మీద టీవీ9 మైక్ కనిపిస్తే జనాలు కొట్టే పరిస్థితి ఏర్పడింది. దేశంలో మరే ఛానెల్ చేయని విధంగా అత్యంత దుర్మార్గంగా వ్యవహరించి అమ్ముడుపోయిన టీవీ9 పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇటు పూర్తిగా ఛానెల్ క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతినడం, అటు రేటింగ్ పడిపోవడం, వైసీపీ ఛానెల్ అనే ముద్ర ఏర్పడటం తో ఏపీలో ఆ ఛానెల్ ని జనాలు చూడలేని పరిస్థితి ఏర్పడింది. మీడియా అంటే ప్రజల పక్షం అన్న విషయం వదిలేసి వైసీపీ దగ్గట కోట్ల రూపాయలు తీసుకుని ఛానెల్ ని వైసీపీకి బానిసత్వం చేసేలా చేశాడు రజనీకాంత్. మరోవైపు టీవీ9 మేనేజ్మెంట్. ఇన్నాళ్లు ఇల్లీగల్ గా కర్నూల్ జిల్లా బనగానపల్లె లో మహా సిమెంట్ కంపెనీ నడుపుతోంది. బనగాన పల్లె , డోన్ నియోజకవర్గాల పరిధిలో వందల ఎకరాలు సున్నపురాయిని సిమెంట్ కంపెనీకి ఇల్లీగల్ గా కట్టబెట్టారు జగన్.

 

ఇంకా చదవండి: మంత్రిగా అవకాశం కల్పించిన పవన్ కి! తెనాలి ప్రజలకు, ఎప్పుడూ రుణపడి ఉంటా!

 

జయజ్యోతి సిమెంట్ కంపెనీ పేరుతో ఉన్న ఆ గనుల్ని చట్ట విరుద్ధంగా మహా సిమెంట్ కంపెనీకి ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగానే ఇన్నాళ్లు టీవీ9 ఛానెల్ జగన్ కు వంతపాడింది. అటు సిమెంట్ కంపెనీ గనుల ద్వారా రామేశ్వరం లబ్ది పొందటం, ఇటు రజినీకాంత్ చిల్లర కకుర్తితో  ఛానెల్ భ్రష్టు పట్టిపోయింది. తాజాగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహా సిమెంట్ కు అక్రమ గనుల కేటాయింపుపై విచారణ జరిపించనుంది. ఇప్పటికే మహా సిమెంట్ కంపెనీ వల్ల తీవ్రమైన కాలుష్యం ఏర్పడిందని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఇన్నాళ్లు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకి భారీ ఎత్తున లంచాలు సమర్పించుకుని సిమెంట్ కంపెనీ ద్వారా వేల కోట్లు సంపాదించిన మైహోం రామేశ్వరరావు. పాపం పండటంతో ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అటు ఛానెల్ పూర్తిగా వివాదాల్లో చిక్కుకోవడంతో ఆంధ్రప్రదేశ్ లో టీవీ9 తెలుగు ఛానెల్ ని పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. వారం రోజుల క్రితం జరిగిన బోర్డ్ మీటింగ్ లో ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎంపికపై ఉత్కంఠ! సీనియర్ టీడీపీ నేతల మధ్య హోరాహోరీ పోటీ!

 

రవిప్రకాష్ ని అక్రమంగా ఛానెల్ నుంచి పంపిన రామేశ్వరరావు గతంలో మోజో టీవీని, టీవీ1 ఛానెల్ ని మూసివేసింది. ఇలా ఛానెల్స్ మూసివేయడంలో బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్న యాజమాన్యం తాజాగా టీవీ9 మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మూసివేయకుండా ఛానల్ ను ఎవరికైనా అమ్మేస్తే మళ్లీ ఛానెల్ రవిప్రకాష్ చేతుల్లోకి వెళ్తుందని ఆందోళనకు గురవుతున్నారట రామేశ్వరరావు. అందుకు నష్టం వచ్చినా పర్వాలేదు. కానీ ఛానెల్ రవిప్రకాష్ చేతుల్లోకి వెళ్లకూడదని ఇలా క్లోజ్ చేసెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏపీ కి సంబంధించిన ఉద్యోగుల్లో చాలామందికి మూడునెలల జీతం ఇచ్చి పంపేయాలని బోర్డ్ నిర్ణయం తీసుకుంది. అటు రజినీకాంత్ ని కూడా సంస్థకి రిజైన్ చేయాలని బోర్డ్ మీటింగ్ లో చెప్పేశారు. రజనీకాంత్ ని బయటకు పంపాక. తెలంగాణ కు చెందిన శైలేష్ రెడ్డి అనే వ్యక్తికి టీవీ 9 తెలంగాణ బాధ్యతలు అప్పగించనున్నారు.

 

ఇంకా చదవండి: సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు! ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

మదనపల్లెలో దారుణం! ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య!

 

నెల్లూరులో ఉద్రిక్తత! విజయోత్సవ ర్యాలీలో విధ్వంసం!

 

వేసవి సెలవులు ముగిశాయి! ఏపీలో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి!

 

నారా భువనేశ్వరి ఎమోషనల్ పోస్ట్! "ఒక భార్యగా, ఒక అమ్మగా నా ఆనందం"!

 

కువైట్: అతి ఘోరమైన అగ్ని ప్రమాదం! మృతులలో భారతీయులే ఎక్కువ?

 

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

 

ఏపీ మంత్రివర్గంలోకి కొత్త ఎమ్మెల్యేలు! తొలిసారి గెలిచిన వారికి పెద్దపీట!

 

నారా చంద్ర బాబు అనే నేను! మాటకి దద్దరిల్లిన ప్రజా వేదిక!

 

వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

 

AP EAPCET 2024 ఫలితాలు విడుదల! మీ మార్కులు వెంటనే చెక్ చేసుకోండి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #AndhraPradesh #TV9Telugu #TV9 #Media #Banned #Appolitics