పండగ సీజన్లో సంచలనం సృష్టించిన అమెజాన్, ఫ్లిప్కార్ట్! ఆన్‌లైన్ షాపింగ్‌లో సరికొత్త చరిత్ర!

Header Banner

పండగ సీజన్లో సంచలనం సృష్టించిన అమెజాన్, ఫ్లిప్కార్ట్! ఆన్‌లైన్ షాపింగ్‌లో సరికొత్త చరిత్ర!

  Sat Oct 05, 2024 16:40        Others

పండగ సీజన్ సందర్భంగా ఆన్లైన్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ సంస్థలు తీసుకొచ్చిన ఫెస్టివ్ సేల్స్లో భారీగా విక్రయాలు నమోదవుతున్నాయి. వీటిల్లో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ముందు వరుసలో నిలుస్తున్నాయి. సెప్టెంబర్ 26న ఈ రెండు కంపెనీలు సేల్స్ మొదలు పెట్టగా.. తొలి వారంలోనే (అక్టోబర్ 2 వరకు) సుమారు రూ.54వేల కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు డాటుమ్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ నివేదిక పేర్కొంది. దసరా, దీపావళి సందర్భంగా మరికొన్ని రోజుల పాటు ఈ సేల్స్ కొనసాగనున్నాయి.
గతేడాదితో పోలిస్తే తొలి వారంలో విక్రయాలు 26 శాతం మేర పెరిగినట్లు సదరు నివేదిక తెలిపింది. మొత్తం అమ్మకాల్లో దాదాపు 60 శాతం వాటా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులదే కావడం గమనార్హం. వీటిల్లో మొబైల్ ఫోన్ల వాటా 38 శాతం కాగా.. ఇతర ఎలక్ట్రానిక్, కన్జూమర్ డ్యూరబుల్స్ వాటా 21 శాతంగా ఉంది. ఈ సేల్స్లో ఐఫోన్ 15తో పాటు, పాత ఐఫోన్ మోడళ్లకు మంచి గిరాకీ ఏర్పడినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తక్కువ ధరలో తీసుకొచ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎస్ఈ ఫోన్కు సైతం మంచి డిమాండ్ నెలకొందని పేర్కొంటున్నారు.
ఈ పండగ సీజన్లో ప్రీమియం మొబైల్స్పై పెద్దఎత్తున డిస్కౌంట్స్ లభిస్తుంటాయి. ఈకారణంగానే చాలామంది ఈ ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా రూ.30 వేల పైబడి మొబైల్స్కు
ఈ సేల్స్లో ఎక్కువ డిమాండ్ ఉందని నివేదిక చెబుతోంది. దీంతోపాటు డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీలు మంచి విక్రయాలు నమోదుచేసినట్లు తెలిసింది. సగానికంటే ఎక్కువమంది పేమెంట్ ఆప్షన్ గా ఈఎంఐని ఎంపిక చేసుకుంటున్నారన్నది మరో ఆసక్తికర అంశం. పైగా చిన్నచిన్న పట్టణాలు, నగరాల నుంచే ఎక్కువ ఆర్డర్లు వస్తుండడం గమనార్హం. తమ వేదికపై జరిగిన 70 శాతం ప్రీమియం స్మార్ట్ఫోన్ విక్రయాలు టైర్-2, టైర్-3 నగరాల నుంచి వచ్చినట్లు అమెజాన్ తెలిపింది. అలాగే, టీవీ సేల్స్ కూడా 80 శాతం ఆయా నగరాల నుంచే వచ్చినట్లు తెలిపింది. మొత్తంగా ఈ ఫెస్టివ్ సీజన్లో అమ్మకాలు దాదాపు రూ. లక్ష కోట్లకు చేరుకోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గతేడాది ఈ మొత్తం దాదాపు రూ.81 వేల కోట్లుగా ఉంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #indiansale #bigsale #festive #sales #todaynews #fashnews #latestupdate