గూగుల్ మోసపూరిత ఖాతాలపై వేట ప్రారంభం! అధికారిక ఖాతాలకు కొత్త వెరిఫైడ్ ఫీచర్!

Header Banner

గూగుల్ మోసపూరిత ఖాతాలపై వేట ప్రారంభం! అధికారిక ఖాతాలకు కొత్త వెరిఫైడ్ ఫీచర్!

  Sat Oct 05, 2024 17:12        Others

గూగుల్లో ఏ అంశం గురించి సెర్చ్ చేసినా దాని తాలూకా నకిలీ ఖాతాలు దర్శనమిస్తుంటాయి. అది కంపెనీ అధికారిక ఖాతానేనా? కాదా? అనే విషయం తెలియకపోవడంతో చాలా మంది మోసపూరిత ఖాతాలనే వినియోగిస్తున్నారు. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. వీటిని అరికట్టేందుకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) నడుంబిగించింది. అందులోభాగంగా తన సెర్చ్ రిజల్ట్స్ కనిపించే ఫలితాలకు వెరిఫైడ్ బ్యాడ్జ్ అందించేందుకు సిద్ధమైంది.
"కంపెనీలకు సంబంధించిన అధికారిక ఖాతాలను గుర్తించేందుకు కొత్త ఫీచర్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం గూగుల్లోని నిర్దిష్ట వ్యాపారాల వెబ్సైట్ల పక్కనే చెక్ మార్క్ లను చూపించేలా పరీక్షలు నిర్వహిస్తున్నాం" అని గూగుల్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే గూగుల్ సెర్చ్ ఫలితాల్లో మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ కంపెనీల అధికారిక సైట్ లింక్ పక్కన బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తోందని ధవెర్జ్ నివేదించింది. టెస్టింగ్ దశలో కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గూగుల్ ఈ సదుపాయాన్ని ఇంకా రోలవుట్ చేయలేదు.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాట్సప్లో అధికారుల ఖాతాను గుర్తించేందుకు వెరిఫైడ్ బ్యాడ్జ్లు అందుబాటులోకి వచ్చాయి. వాటి సాయంతో ఫేక్ ఖాతాలను సులువుగా గుర్తిస్తున్నాం. ఇకపై అలాంటి సదుపాయమే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లోనూ కనిపించనుంది. మోసపూరిత కంటెంట్ను గుర్తించి వాటిని సెర్చ్ రిజల్ట్స్ చూపించకుండా ఉండేందుకు గూగుల్ ఇప్పటికే ఆటోమేటెడ్ సిస్టమ్లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!

 

ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!

 

ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!

ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?

 

అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!

 

హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #google #searchengine #websites #updates #todaynews #flashnews #latestupdate