ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

Header Banner

ఏపీ ప్రజలు ఎగిరి గంతేసే విషయం.. విశాఖ - విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! ఈ ప్రాజెక్టు రెండు దశల్లో - అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

  Tue Dec 03, 2024 09:00        Travel, Politics

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి మహా నగరాలకే పరిమితమైన మెట్రో సేవలను త్వరలోనే ఏపీకి అందుబాటులోకి తీసుకురానుంది. తాజాగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రోకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల తొలి దశ డీపీఆర్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో ప్రాజెక్టులో మొదటి దశలో 46.23 కి.మీ మేర మూడు కారిడార్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. అవి ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉంటనున్నాయంటే?

 

మొదటి కారిడార్: విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కి.మీ
రెండో కారిడార్: గురుద్వార్ నుంచి పాత పోస్ట్‌ ఆఫీస్ వరకు 5.08 కి.మీ
మూడో కారిడార్: తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ

 

ఇవి మొత్తం రూ. 11,498 కోట్ల వ్యయంతో చేపట్టనున్నారు. ప్రాజెక్టు రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30.67 కి.మీ మేర నాలుగో కారిడార్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.



ఇంకా చదవండిరూ.11,467 కోట్లతో అమరావతి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం! ఆ ప్రాంతాల వారికి పండగే పండగ!



విజయవాడ మెట్రో ప్రాజెక్టు...
విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రెండు దశల్లో చేపట్టనున్నారు. అవి ఎక్కడ నుంచి ఎక్కడికంటే?

 

కారిడార్ 1ఎ: గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు

కారిడార్ 1బి: పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు


మొత్తం 38.4 కి.మీ మేర ఈ రెండు దశల్లో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి రూ. 11,009 కోట్ల వ్యయం అంచనా వేయగా, భూసేకరణ కోసం రూ. 1,152 కోట్లు ఖర్చు చేయనున్నారు. రెండో దశలో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మూడో కారిడార్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే నగరాల ప్రయాణ అవసరాలు గణనీయంగా మెరుగుపడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

 

ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం సీరియస్ డిస్కషన్! ఢిల్లీ పర్యటనపై కీలక అప్డేట్!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేషన్ కార్డులపై సర్కార్ క్లారిటీ - అదంతా ఒట్టిదే! వారి స్థానంలో కొత్త కార్డులు!

 

ఓరి దేవుడా.. ఏంటి నిజమా..! రోజు ఇడ్లీ తింటున్నారా? అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


బూడిద తరలింపు వివాదం.. ఎమ్మెల్యేపై చంద్రబాబు ఫైర్! ఎందుకు అంటే!

 

మందుబాబులకు కిక్కే కిక్కు.. భారీగా తగ్గిన మద్యం ధరలు! ఆ వివరాలు మీ కోసం..

 

2/12 TO 14/12 వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి మరో షాక్.. కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్! కీలక అంశాలు వెలుగులోకి...

 

నాగచైతన్య పెళ్లికి నాగార్జున ఇస్తున్న బహుమతి ఏమిటో తెలుసాదాదాపు ఎనిమిది గంటల సమయం!

 

వైసీపీకి షాక్.. రోజాపై పోలీసులకు ఫిర్యాదు! ఫొటోలువీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్!

 

ఏపీలో ప్రజలకు గుడ్ న్యూస్! కొత్త రేషన్ కార్డులు! దరఖాస్తులు ఎప్పటినుంచి అంటే?

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! శ్రీవారి ప్రత్యేక దర్శనంగోల్డెన్ ఛాన్స్! టోకెన్లు ఇలా...

 

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారాఅలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #visakha #metro #project #greensignal #todaynews #flashnews #latestupdate