వసతి గృహాల మౌలిక సదుపాయాలపై హైకోర్టు ఆగ్రహం! ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోతాయా?

Header Banner

వసతి గృహాల మౌలిక సదుపాయాలపై హైకోర్టు ఆగ్రహం! ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోతాయా?

  Thu Jan 09, 2025 09:55        Others

సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కోసం వైకాపా ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా నిధులను విడుదల చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 2021-22లో రూ.24.60 లక్షలు మాత్రమే కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆ సొమ్ముతో వసతి గృహాల్లో సదుపాయాల కల్పన ఏవిధంగా సాధ్యమని ప్రశ్నించింది. 2021-22కు పూర్వం, ఆ తర్వాత సైతం తూతూ మంత్రంగా నిధులు కేటాయించారని గుర్తుచేసింది. 2019-2024 మధ్య కాలంలో వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.20 కోట్లు కూడా ఖర్చుచేయలేదని పేర్కొంది. 90వేల మంది విద్యార్థులు ఉంటున్న వసతి గృహాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తాము అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో రూ.143 కోట్లు కేటాయించినా అవి ఏవిధంగా సరిపోతాయని ప్రశ్నించింది. పేద పిల్లలు చదువుకునే హాస్టళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదంది. ప్రాథమికంగా తాగునీరు, బెడ్లు, దస్తులు, మరుగుదొడ్లు, పౌష్టికాహారం.. సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. సంక్షేమ వసతిగృహాలకు ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు, కేటాయించిన సొమ్ము సరిపోతుందా తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ను ఆదేశించింది.



ఇంకా చదవండినామినేటెడ్ పదవులు సంక్రాంతి నుండి? భారీ సంఖ్యలో ఆశా వాదులు! అన్ని అంశాలలో ముందంజలో ఉన్న వారికే!



తదుపరి విచారణకు సంక్షేమశాఖ కమిషనర్ ఆన్లైన్ ద్వారా హాజరుకావాలని ఆదేశించింది. కనీసం ఐదు వసతి గృహాల్లోని పరిస్థితులను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలను ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కొరతను ప్రశ్నిస్తూ కాకినాడకు చెందిన కేఏఎస్ గురుతేజ 2023లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపున న్యాయవాది జి.అరుణ్్శరి వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎసీపీ) ఎస్. ప్రణతి వాదనలు వినిపిస్తూ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ విషయంలో నిధుల కేటాయింపును పెంచామన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2024-25లో ప్రభుత్వం రూ.143 కోట్లు కేటాయించిందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేయడానికి సమయం కావాలని కోరారు. కోర్టు ముందు ఉంచిన వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. వసతి గృహాల్లో ఉన్న పిల్లల కులాలను అధికారులు పేర్కొనడాన్ని ఆక్షేపించింది. పిల్లల విషయంలో కులాల ప్రస్తావన ఎందుకని ప్రశ్నించింది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:

 

విద్యార్థులకు సూపర్ న్యూస్.. ఇంటర్‌లో కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు.. ఇది మంచి నిర్ణయం! సలహాలు, సూచనలకు బోర్డు ఆహ్వానం!

 

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం! సంక్రాంతికి స్టార్ట్! పిఠాపురంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా!

 

అయ్యో.. అయ్యయ్యో.. మందుబాబులకు బాడ్ న్యూస్! ఆ కంపెనీ ఏడు రకాల బీర్ల సరఫరా నిలిపివేత!

 

పవన్ కళ్యాణ్ అద్భుతమైన ప్రసంగం.. మోదీ నిర్దేశకత్వంచంద్రబాబు నాయకత్వం... ఇదే మా పంథా!

 

ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఇక వారికీ పండగే పండగ! ఇకపై ఆ పరీక్షలు రద్దు!

 

వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం... జగన్ సోదరుడు మృతి!

 

టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్ చల్.. ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా..!

 

నేడు (8/1) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

మహిళలకు మోదీ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. నెలకు రూ.7 వేలు! 18 నుంచి 70 ఏళ్ల లోపు.. ఈ స్కీం ఎలా అప్లై చేయాలంటే!

 

వైకాపాకు మరో బిగ్ షాక్! కీలక నేతని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

 

వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీ నేతమాజీ మంత్రిపై కేసు నమోదు! ఆలస్యంగా వెలుగులోకి.. లైంగిక వేధింపులు..

 

దిక్కుతోచని పరిస్థితిలో జగన్.. విశాఖ జిల్లాలో దారుణంగా వైసీపీ పరిస్థితి! అరడజను నియోజకవర్గాల్లో నేతలు కరువు!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #hostels #gurukulahostels #highcourt #todaynews #flashnews #latestupdate