తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!

Header Banner

తమిళనాడులో కల్తీ మద్యం కలకలం! 10 మంది మృతి! అధికారులపై బదిలీ వేటు!

  Thu Jun 20, 2024 08:00        India

తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగి పది మంది చనిపోయారు. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం కరుణాపురంలోని వ్యాపారి దగ్గర స్థానిక కూలీలు కల్తీ మద్యం ప్యాకెట్లు కొనుగోలు చేశారు. అది తాగిన తర్వాత అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి లాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. 20 మందికి పైగా బాధితులు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేరారు. అందులోని మరో పది మందిని మెరుగైన వైద్యం కోసం పుదుచ్చేరిలోని జిప్మర్ కు తరలించారు. బాధితుల బ్లడ్ శాంపిల్స్ ను విల్లువపురం, జిప్మర్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ లకు పంపించారు. మద్యంలో మిథనాల్ అనే విషపదార్థం కలిపినట్లు తేలింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ చర్యలు తీసుకున్నారు. కేసును విచారించాలని సీబీసీఐడీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని బదిలీ చేశారు. వారిస్థానంలో వేరొకరికి బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా, జిల్లా ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్కు చెందిన టీంని సస్పెండ్ చేశారు. మంత్రులు ఇ.వి.వేలు, ఎం. సుబ్రహ్మణ్యం కళ్లకురిచ్చి ఆస్పత్రుల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

 

ఇవి కూడా చదవండి 

హజ్ యాత్రలో తీవ్ర విషాదం! 550 మృతి! కారణం అదే!

 

మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్! బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్!

 

ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆ పేర్లు ఉండవు! వెంటనే అమలు! 

 

ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును వాడుకుంది చాలు! తిరిగి ఇచ్చేయాలి! ఫర్నీచర్ కోసం జగన్ కు జీఏడీ లేఖ! 

 

టీవీ9 రజినీకాంత్ కు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వం! ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసులు! 

 

ఆఫీసుకు రాకుండానే జీతాలు ఇచ్చేస్తారా! మరో వైసీపీ కుంభకోణం వెలుగులోకి! 

 

త‌న‌దైన శైలిలో ముందుకు వెళ్తున్న యువనేత! మినిస్ట‌ర్ లోకేష్‌ ఆన్ డ్యూటీ! 

 

కుక్క తోక వంకర అన్నట్టు... మారని టీవీ9 తీరు! ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో! 

 

పాస్ పుస్తకాలపై ఎలాంటి ఫోటోలు ఉండకూడదు! ప్రభుత్వం ఉత్తర్వులు! 

                                                                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Alcohol #AlcoholDeaths #TamilNadu #CheapLiquor #AlcoholVictims