అప్పు ఇవ్వలేదనే కోపం! స్నేహితుడి సాయంతో ఇంటి ఓనర్‌ను వివస్త్రను చేసి! వెలుగులోకి నిజాలు! ఎక్కడంటే!

Header Banner

అప్పు ఇవ్వలేదనే కోపం! స్నేహితుడి సాయంతో ఇంటి ఓనర్‌ను వివస్త్రను చేసి! వెలుగులోకి నిజాలు! ఎక్కడంటే!

  Sat Jun 29, 2024 16:00        India

పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో జరిగిన మహిళ దారుణహత్య కేసులో మిస్టరీ వీడింది. మహిళను హత్య చేసింది.. ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్నవారేనని పోలీసులు తేల్చారు. హత్య చేయడానికి ముందు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ వెల్లడించారు. మద్యాన్ని అప్పుగా ఇవ్వలేదనే కారణంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు చెప్తున్నారు. కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన 53 ఏళ్ల మహిళ గురువారం హత్యకు గురైంది. మహిళను కర్రతో కొట్టి అత్యాచారం చేసి, ఆపై హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా దీనికి కారణమైన ఇద్దరిని గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఓ బడ్డీ కొట్టు నడుపుతూ ఉండేది. దానితోపాటు బెల్టు దుకాణం నిర్వహించేవారు. వీరికి రెండు ఇళ్లు ఉండగా.. ఓ ఇంటిని అద్దెకు ఇచ్చారు.

 

ఇంకా చదవండి: మరీ ఇంత దారుణంగా ఉన్నారు ఏంట్రా బాబు! ప్రేయ‌సి తండ్రిని క‌త్తితో పొడిచి చంపిన యువ‌కుడు!

 

అద్దెకు ఇచ్చిన ఇంటిలో రామావత్ బాబు నాయక్ అనే వ్యక్తి బాడుగకు ఉంటున్నాడు. అయితే బాధితురాలి బడ్డీ కొట్టు వద్ద బాబు నాయక్ మద్యం తాగుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఆమె దగ్గర అప్పుచేసి మరీ మద్యం తాగడం మొదలెట్టాడు. అయితే ఇటీవల ఓ రోజు తన స్నేహితుడు బాలూ నాయక్‍తో కలిసి మద్యం తాగేందుకు వెళ్లాడు బాబు నాయక్. అయితే బాధితురాలు అప్పు ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలో అప్పు ఉన్న డబ్బులు తిరిగి ఇస్తేనే మందు ఇస్తానని తెగేసి చెప్పింది. దీంతో బాబూ నాయక్, బాలూ నాయక్ ఆమెపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంటికి వచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివస్త్రను చేసిన అత్యాచారం చేయడమే కాకుండా.. కర్రతో కొట్టి హత్య చేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్డు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అయితే ఇంట్లో బాడుగకు ఉన్న వ్యక్తే ఇంత దారుణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

 


ఇంకా చదవండి: అప్పుడు అధికార అహంకారంతో విర్రవీగిన జగన్! ఇప్పుడు దర్పం లేక రగిలిపోతున్న మామూలు MLA! అయినా కుక్క తొక వంకరే - బుద్ధి మారదు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రిరిజం పై ఫోకస్ పెట్టిన కూటమి! పాత కేసుల ఫైళ్లకు బూజు దులుపుతోన్న పోలీస్! ఇక ఒక్కొక్కడి ప్యాంటు తడిసిపోవాల..

 

అమెరికాలో తెలుగువారి డామినేషన్! యూనివర్సిటీలలో తెలుగులో స్వాగతం!

 

నెలకు రూ.25వేలతో ఉద్యోగం, ఉచిత భోజనం, వారికి మాత్రమే! ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్!

 

మీరు నమ్మాల్సిందే! ఇది అయోధ్య.. వైరల్ అవుతున్న న్యూస్! దారుణంగా రామాలయ పరిసర ప్రాంతాలు!

 

ఈ 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సాప్‌ బంద్‌! ఫోన్ల లిస్ట్ చూడండి! లిస్ట్ లో మీ ఫోన్ ఉంటే ఏమి చేయాలి?

 

తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపులు! ఎయిడ్స్ రావడంతో! సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్!

 

ఒకరి ఐఆర్‌సీటీసీ ఐడీతో ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష విధిస్తారా? రైల్వే సమాధానం ఇదే!

 

ప్రపంచంలో అత్యధిక బంగారం ఉన్న టాప్ పది దేశాలు! మొదటి స్థానంలో అమెరికా! భారత్ స్థానం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #Dead #Palnadu