ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూసుండరు! ఇంట్లో అన్నీ దోచేసి... ఒక లేఖ రాశాడు! అందులో ఏముందంటే!

Header Banner

ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూసుండరు! ఇంట్లో అన్నీ దోచేసి... ఒక లేఖ రాశాడు! అందులో ఏముందంటే!

  Thu Jul 04, 2024 20:59        India

ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలకు కొదువే లేకుండా పోయింది. సోషల్ మీడియాలో ఏ చిన్న వింత సంఘటన అయిన సరే వైరల్గా మారుతుంది. ఇటీవల ఓ దొంగ దోచుకోవడానికి వెళ్లి అక్కడే ఏసీ ఆన్ చేసుకుని నిద్రపోయిన ఘటన మరువక ముందే మరో వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ దొంగ దొంగతనానికి పాల్పడ్డారు. సెల్వన్, ఆయన భార్య ఇద్దరు రిటైర్డ్ ఉపాధ్యాయులు. వారివురు చెన్నైలో ఉంటున్న తన కుమారుడిని చూసేందుకు జూన్ 17వ తేదీన వెళ్లారు. వారింట్లో సెల్వీ అనే ఓ పని మనిషిని పెట్టుకున్నారు. వారు ఇంట్లో లేనప్పుడు ఇంటిని శుభ్రంగా చేసేందుకు పెట్టుకున్నారని సమాచారం.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

అయితే ఓ రోజు ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లిన సెల్వీ తలుపులు తెరిచి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే తను సెల్వన్కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో హుటహుటీన ఆయన నివాస స్థలానికి చేరుకున్నారు. దీంతో ఇంట్లో దొంగలు పడ్డారని గమనించి..రూ.60 వేల నగదు, 12 గ్రాముల బంగారు నగలు, వెండి పట్టీలు దోచుకెళ్లినట్లు చెప్పారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టాగా దొంగ రాసిన క్షమాపణ లేఖ కనిపించింది. 'ఆ లేఖలో తనను క్షమించాలని, దోచుకున్న వస్తువులను నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ ఉంది. తన ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగా లేకపోవడం వలన ఈ పని చేయాల్సి వచ్చిందిని తెలిపారు'. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు! మంత్రి లోకేశ్ ఫైర్! 

 

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

 

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

 

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

 

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

 

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు! 

 

ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!

 

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

 

అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!

 

నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!

 

అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

 

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

 

శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి! 

                                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #india #Theft #Thief #TamilNadu #AndhraPravasi