స‌ద్గురుకు సుప్రీం కోర్టులో ఊర‌ట‌! ఈషా ఫౌండేష‌న్‌పై పోలీసుల యాక్ష‌న్‌కు బ్రేక్‌!

Header Banner

స‌ద్గురుకు సుప్రీం కోర్టులో ఊర‌ట‌! ఈషా ఫౌండేష‌న్‌పై పోలీసుల యాక్ష‌న్‌కు బ్రేక్‌!

  Thu Oct 03, 2024 14:32        India

న్యూఢిల్లీ: స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేష‌న్‌పై పోలీసుల చ‌ర్య‌ల‌కు బ్రేక్ వేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈషా ఫౌండేష‌న్‌తో లింకున్న అన్ని క్రిమిన‌ల్ కేసుల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని మ‌ద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌తో త‌మిళ‌నాడు పోలీసులు చ‌ర్య‌ల‌కు దిగారు. ఈ నేప‌థ్యంలో ఈషా ఫౌండేష‌న్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాల‌పై సుప్రీం స్టే ఇచ్చింది. కోయంబ‌త్తూరులోని ఈషా ఫౌండేష‌న్ ఆశ్ర‌మంలో ఉన్న త‌న ఇద్ద‌రు కూతుళ్ల‌కు బ్రెయిన్‌వాష్ చేశార‌ని, దాంతో వాళ్లు ఇంటికి రావ‌డం లేద‌ని ఓ తండ్రి దాఖ‌లు చేసిన పిటీష‌న్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

 

ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఇంకా చదవండిఏపీలో పారా క్రీడల అభివృద్ధికి లోకేశ్ హామీ! రాష్ట్రంలో పారా క్రీడల అభివృద్ధికి!  

 

చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాసనం ఇవాళ ఈ కేసులో వాద‌న‌లు విన్న‌ది. ఆ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌తో ధ‌ర్మాస‌నం మాట్లాడింది. త‌మ ఇష్ట‌పూర్వ‌కంగానే ఆశ్ర‌మంలో ఉంటున్న‌ట్లు ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు వెల్ల‌డించారు. త‌మ‌ను ఎవ‌రూ నిర్బంధించ‌డంలేద‌ని పేర్కొన్నారు. ఈషా ఫౌండేష‌న్‌పై న‌మోదు అయిన కేసును మ‌ద్రాసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం తెలిపింది. త‌మిళ‌నాడు పోలీసులు ఇచ్చే స్టేట‌స్ రిపోర్టును సుప్రీంకు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు!

 

ఏపీ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్! నియామక ప్రక్రియ వేగవంతం! హోం శాఖ అనిత కీలక ప్రకటన!

 

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! ఈ పంపిణీ ద్వారా రాష్ట్రంలో!

 

ఏపీ మహిళలకు దసరా కానుక! సీఎం చంద్రబాబు అదిరిపోయే గిఫ్ట్! ఇందులో మహిళలు 40 శాతం!

 

టీడీపీ కేంద్రంలో అర్జీల స్వీకరణలో నూతన కోణం! ప్రజల సమస్యలపై ఫోన్లోనే ఆదేశాలు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group 

 



   #AndhraPravasi #India #IshaFoundation #Sadguru #Isha