వయనాడ్ కు రిలీఫ్ ఫండ్ ఇచ్చేది ఎప్పుడు? కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు!

Header Banner

వయనాడ్ కు రిలీఫ్ ఫండ్ ఇచ్చేది ఎప్పుడు? కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు!

  Fri Oct 04, 2024 22:03        India

కొండచరియలు విరిగిపడటంతో జులై 30న అతలాకుతలమైన వయనాడ్ కు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వ సహాయక నిధులు అందకపోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఆర్ఎఫ్), ప్రధానమంత్రి ఉపశమన నిధి (పీఎంఆర్ఎఫ్) నుంచి కేరళ రాష్ట్రానికి ఇంకా సాయం ఎందుకు అందలేదని న్యాయమూర్తులు జస్టిస్ ఎ.కె.జయశంకరన్ నంబియార్, జస్టిస్ శ్యామ్ కుమార్ వి.ఎంలతో కూడిన ధర్మాసనం కేంద్ర సర్కారును ప్రశ్నించింది.

 

ఇంకా చదవండిఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం! ఎక్కడో తెలుసా? 

 

ఇంకా చదవండిగల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వయనాడ్ లాగే ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్న తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్రం నిధులను విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. స్పందించేందుకు కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈనెల 18లోగా సమగ్ర వివరణను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ)లను హైకోర్టు ఆదేశించింది. వయనాడ్ కు సహాయక నిధులను త్వరితగతిన విడుదల చేయాలని నిర్దేశించింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తీవ్ర జ్వరంతో తిరుమలలోనే ఉండిపోయిన డిప్యూటీ సీఎం! వారాహి సభ ఉంటుందా? లేదా?

 

పిచ్చి ఆకులు అనుకోని పడేస్తున్నారా? వాటితో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

 

తిరుమల లడ్డూ వివాదంపై పెరిగిపోతున్న ఉత్కంఠ! సుప్రీం కోర్టులో విచారణ వాయిదా!

 

బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ! ఐదేళ్లలో నాలుగో సారి పార్టీ చేంజ్!

 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు షాక్‌! మరో 14 రోజులు రిమాండ్‌ పొడిగింపు!

 

గుడ్‌న్యూస్ చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి నుంచి మరో కొత్త పథకం! తాను చేసిన పనికి గుర్తింపు!

 

హత్యకు గురైన పవన్ కల్యాణ్ బౌన్సర్! ఎవరుఎందుకు చేశారు..! అసలేం జరిగింది..

 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో కొత్త మలుపు! విచారణకు మళ్లీ పోలీసుల నోటీసులు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group  

 



   #AndhraPravasi #India #Wayanad #Environment #LandSlide #RiliefFund #CentralGovernment