రెండేళ్లుగా మహిళ కడుపులో కత్తెర! సీటీ స్కాన్‌ చూసిన డాక్టర్లు షాక్‌!

Header Banner

రెండేళ్లుగా మహిళ కడుపులో కత్తెర! సీటీ స్కాన్‌ చూసిన డాక్టర్లు షాక్‌!

  Sat Nov 30, 2024 21:45        India

ఒక మహిళ రెండేళ్లుగా కడుపు నొప్పితో బాధపడింది. మందులు వాడినా ఫలితం లేకపోవడంతో డాక్టర్లు సీటీ స్కాన్ చేశారు. ఆమె కడుపులో కత్తెర ఉండటం చూసి షాక్‌ అయ్యారు. రెండేళ్ల కిందట ఆ మహిళకు సర్జరీ చేసిన వైద్యులు పొరపాటున ఆ కత్తెరను ఆమె కడుపులో మరిచిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. సౌంధ గోహద్‌లో నివసించే 44 ఏళ్ల కమలా బాయికి రెండేళ్ల కిందట గ్వాలియర్‌లోని ప్రసిద్ధ కమల రాజా హాస్పిటల్‌లో ఆపరేషన్ చేశారు. నాటి నుంచి ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది.

 

ఇంకా చదవండితస్మా జాగ్రత్త: బాగా తిన్నా నీరసమా? ఈ లోపమే కారణం కావొచ్చు! కొన్ని లక్షణాల ఆధారంగా.. 

 

ఇంకా చదవండిడ‌యాబెటిస్ ఉన్న‌వారు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగ‌వ‌చ్చా? తాగితే ఏమ‌వుతుంది?

 

కాగా, శుక్రవారం ఆ మహిళకు సీటీ స్కాన్ చేశారు. ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు గ్రహించి డాక్టర్లు షాక్‌ అయ్యారు. రెండేళ్ల కిందట ఆ మహిళకు సర్జరీ చేసిన వైద్యులు పొరపాటున ఆ కత్తెరను ఆమె కడుపులో మరిచి కుట్టేసి ఉంటారని అనుమానించారు. సర్జరీ ద్వారా ఆ కత్తెరను తొలగించారు. మరోవైపు నిర్లక్ష్యం వహించిన నాటి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ కుటుంబం డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామని జిల్లా ఆసుపత్రి అధికారులు తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ మహిళల అకౌంట్లలో రూ.1,500... ఇది మీరు గమనించారా? అలా అస్సలు చేయవద్దు - ప్రభుత్వం కీలక అప్డేట్!

 

కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..వీటి ధర చూస్తే తక్కువ! మైలేజ్ చూస్తే ఎక్కువ.. ఆ బైక్స్ ఇవే!

 

మూగబోయిన గొంతులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి! వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు!

 

షాకింగ్ న్యూస్..ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్! ఎవరు చేశారుఅసలు నిజం ఇదే!

 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి సంక్షేమ పథకాలు రద్దు! 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #India #Women #MadhyaPradesh #MedicalError