అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

Header Banner

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

  Fri Jul 05, 2024 07:00        అమరావతి - The Capital

అమరావతి వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నుంచి నిడమనూరు వరకూ ఫ్లై ఓవర్ నిర్మించేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. రాజధాని ఔటర్ రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అంతేకాదు త్వరలోనే ఉత్తర్వుల జారీ చేస్తామని కేంద్రమంత్రి నిడిన్ గడ్కరీ హామీ ఇచ్చారు.

 

కాగా 2014లో టీడీపీ హయాంలో అమరావతి రాజధాని చుట్టూ 189 కిలో మీటర్ల పొడువున 150 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల్లో ఔటర్ రింగు రోడ్డు నిర్మించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ రోడ్డు నిర్మాణానికి అటు కేంద్రం సైతం ఓకే చెప్పింది. కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో 87 గ్రామాలను అనుసంధానం చేసేలా ఔటర్ రింగు రోడ్డును నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం ఆర్అండ్ బీ అధికారులు ప్రతిపాదనలను సైతం సిద్ధం చేశారు. ఆర్వీ అసిసోయేట్స్ తో డీపీఆర్ లు కూడా తయారు చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ ఔటర్ రింగు రోడ్డు నిర్మాణం కోసం 3400 హెకార్ల భూమితో పాటు భూ సేకరణకు రూ.4 వేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబు ప్రభుత్వం అంచనా వేసింది. భూసేకరణతో పాటు ఔటర్ రింగు రోడ్డు పూర్తి నిర్మాణం కోసం మొత్తం రూ.17,500 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, భారత మాల ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు అప్పటి కేంద్రప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసింది.

 

అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి ఔటర్ రింగు రోడ్డుతోపాటు విభజన హామీలపై ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేశారు. కేంద్రమంత్రులను కలిసి అమరావతి ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఆవశ్యకతను వివరించారు. దీంతో కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

 

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

 

ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూసుండరు! ఇంట్లో అన్నీ దోచేసి... ఒక లేఖ రాశాడు! అందులో ఏముందంటే!

 

మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు! మంత్రి లోకేశ్ ఫైర్! 

 

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

 

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

 

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

 

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

   

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

    

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

                                                                                     

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AndhraPradesh #Amaravathi #TheCapital #AP #APGovernment #OuterRingRoad #ORRinAmaravathi