అమరావతి నిధులకు షరతులు వర్తిస్తాయి! సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఐఏఎస్ లేఖ!

Header Banner

అమరావతి నిధులకు షరతులు వర్తిస్తాయి! సీఎం చంద్రబాబుకు రిటైర్డ్ ఐఏఎస్ లేఖ!

  Fri Jul 26, 2024 08:55        అమరావతి - The Capital

అమరావతి అభివృద్ధి కోసం కేంద్రం కేటాయించిన రూ.15 వేల కోట్ల నిధులు చేజారిపోకుండా అప్రమత్తంగా ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రానికి రూ.15,000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందిస్తామని కేంద్రం పార్లమెంట్ లో ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. నిధుల వినియోగానికి పలు షరతులు ఉంటాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రపంచ బ్యాంకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ భారతదేశం తరఫున గవర్నర్ గా ఉన్న అనుభవం ఆధారంగా ఈ క్రింద సూచించిన విషయాలపై దృష్టి సారించాలని ఆయన గురువారం సీఎంకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ముఖ్యంగా ఈ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ముందస్తు హామీలు తీసుకోవాలని శర్మ సూచించారు. ప్రపంచ బ్యాంకు ఇతర సంస్థల కన్సార్టియం రాష్ట్రానికి ఇచ్చే నిధులను రాష్ట్రానికి ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులకు అదనంగా కేంద్రం విడుదల చేయాలని, ప్రపంచ బ్యాంకు ఇతర సంస్థల నుంచి వచ్చే నిధులు డాలర్ల రూపంలో ఉంటున్న కారణంగా ఎక్స్చేంజ్ భారం పడకుండా చూడాలని సూచించారు. ఇవ్వవలసిన గ్రాంట్ వాటా మీద ముందస్తు హామీ తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణాలు పర్యావరణ దృష్ట్యా షరతులతో ముడిపడివుంటాయి కాబట్టి ఆ ఉల్లంఘనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అమరావతి ప్రణాళిక మీద జాతీయ హరిత ట్రిబ్యునల్ ఓఏ నెం.171/2017 లో 2017 కేసులో ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకు అమలు చేసిందన్న దానిపై ప్రపంచ బ్యాంకు వారు ప్రశ్నించే అవకాశం ఉందని వాటిని పరిగణనలోకి తీసుకోవాలని శర్మ గుర్తు చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

రాజధాని ప్రజలకు మరో గుడ్ న్యూస్! అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు!

 

వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం! తాజాగా మరో ఎమ్మెల్యే!

 

ఢిల్లీలో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ధర్నా! గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారనివ్యాఖ్యలు!

 

కక్షసాధింపు ఆలోచన లేదంటున్న టీడీపీ! రాష్ట్రంలో సమస్యలు గుర్తించి సూచనలు!

 

లండన్ లోని హైడ్ పార్కులో క్లీంకారతో మెగా ఫ్యామిలీ! పారిస్ లో సమ్మర్ ఒలింపిక్స్!

 

ఆంధ్ర కళా వేదిక ఖతార్ ఆధ్వర్యంలో "నాట్య నీరాజనం"! విజయవాడలో సాయంత్రం 6 గంటలకు!

 

రాత్రిపూట పెరుగన్నం తింటున్నారా? తింటే వచ్చే సమస్యలివే! ముఖ్యంగా వీరికి అస్సలు మంచిది కాదు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP #JSP