అమరావతికి రూ.15 వేల కోట్లు రుణసాయం! వరల్డ్ బ్యాంక్ గ్యారంటీ! సైకో ప్రభుత్వం గతంలో ఇవ్వనీయకుండా!

Header Banner

అమరావతికి రూ.15 వేల కోట్లు రుణసాయం! వరల్డ్ బ్యాంక్ గ్యారంటీ! సైకో ప్రభుత్వం గతంలో ఇవ్వనీయకుండా!

  Wed Aug 14, 2024 09:40        Politics, అమరావతి - The Capital

ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్ల రుణసాయం ప్రపంచబ్యాంక్ నుంచి అందించేందుకు గ్యారంటీ ఇస్తామని ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆర్దికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది జరిగిన నెల రోజుల్లోపే ప్రపంచ బ్యాంక్ బృందం తాజాగా అమరావతి రాజధానికి వచ్చింది. రెండు రోజుల పాటు రాజధానిలో నిర్మాణాలను పరిశీలించిన వరల్డ్ బ్యాంక్ టీమ్ చివరిగా సీఎం చంద్రబాబుతో భేటీ ఆయన విజన్ ఏంటో తెలుసుకుంది. ఈ భేటీలో వరల్డ్ బ్యాంక్ టీమ్ కీలక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నలుగురు సభ్యుల వరల్డ్ బ్యాంక్ టీమ్ అమరావతిలో పర్యటించి భవనాల తాజా పరిస్ధితి తెలుసుకున్నాక చంద్రబాబుతో భేటీ అయింది. ఇందులో 2050 నాటికి అమరావతి జనాభా 35 లక్షలకు చేరుకుంటుందని, వీరికి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.15 వేల కోట్లను రుణంగా ఇవ్వాలని చంద్రబాబు కోరారు. రాజధానిలో 20 శాతాన్ని పార్కులు, పచ్చదనంతో గ్రీన్‌ ఏరియాగా మార్చుతామని, అమరావతిలోని ప్రతి ఒక్కరూ కాలినడకన పార్కులకు చేరుకునే స్థాయిలో వీటిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

 

ఇంకా చదవండి: అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డు! ప్రతిపాదనను పరిశీలిస్తున్న ఏపీ ప్రభుత్వం!

 

 డ్రైనేజీ, రోడ్ల కనెక్టివిటీ, మంచినీరు, ట్రంక్‌ ఇన్‌ఫ్రాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. వీటి కోసం తొలి విడతగా రూ.15 వేల కోట్లు కోరారు. అయితే గతంలో రూ.3500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమై చివరి నిమిషంలో స్ధానికుల నుంచి అందిన ఫిర్యాదులతో ఆగిపోయిన ప్రపంచబ్యాంక్.. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వద్దనడంతో ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకుంది. ఇప్పుడు పరిస్ధితులు ఎలా ఉన్నాయనే అంశంపై చంద్రబాబును ప్రపంచబ్యాంక్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో పరిస్ధితులు మారినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ తీసుకునేందుకు మరోసారి అమరావతికి వస్తామని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు. అయితే ఓవైపు కేంద్రం గ్యారంటీ ఉండటం, మరోవైపు చంద్రబాబు అమరావతి అభివృద్ధి ప్రణాళికల్ని ముందుంచిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ టీమ్ తదుపరి భేటీలో రూ.15 వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే సాధ్యమైనంత త్వరలో అమరావతిలో మౌలిక సదుపాయాల్పనతో పాటు ఇతర పనులు ప్రారంభం కాబోతున్నాయి.

 

ఇంకా చదవండి: విద్యార్థులకు చంద్రబాబు గుడ్ న్యూస్! ఒక్కొక్కరికి రూ.80 వేలు! మరో వైపు తల్లికి వందనం స్కీమ్ అమలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!

 

వాలంటీర్లకు గుడ్ న్యూస్! నెలకి రూ.10 వేల జీతం.. ఎప్పటి నుంచంటే? వీరికి ఉద్యోగం సచివాలయంలోన లేక వేరే శాఖలోనా?

 

ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!

 

శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!

 

ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!

 

వైసీపీకి మరో షాక్ - అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు! దానికి కారణం అదేనా!

 

3303 అడుగుల అత్యంత భారీ జెండాతో తిరంగ ర్యాలీ! విజయవాడ పురవీధుల్లో! రికార్డు స్థాయిలో అతిరథ మహారథులతో!

 

వచ్చే నెల నుండి కొత్త రూల్! అలా చేస్తే సిమ్ కార్డ్ బ్లాక్!

 

ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై ప్రభుత్వం రెడ్ అలర్ట్! ప్రజా భూములపై వైసీపీ నేతల దుర్వినియోగం!

 

రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి ఒకేసారి రూ.15 వేలు! ప్రభుత్వం కీలక ప్రకటన?

 

కూటమి సంచలన నిర్ణయం! ఎమ్మెల్సీ ఎన్నికకు దూరం! కారణం ఏంటి?

 

సుబానీ హోటల్ డ్రామా, చీకటి దందా వెలుగులోకి! డ్రగ్స్ తో గుంటూరు దద్దరిల్లింది!

 

సీఎం సంచలన నిర్ణయం.. సచివాలయ వ్యవస్థ పేరు మార్పు! కొత్త పేరు ఇదే! దానికి కారణం అదేనా?

 

దువ్వాడ కేసులో బిగ్ ట్విస్ట్! సూసైడ్‌కు చేసుకున్న మాధురి? అసలు ఏమి జరిగింది అంటే!

 

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరే శుభవార్త! భారీ తగ్గింపు! ఆ వివరాలు మీకోసం!

 

రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు దాటిన వారికి భారీ శుభవార్త! ఉచితంగానే.. ప్రభుత్వ బ్యాంక్ మతిపోయే ఆఫర్!

 

కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు? కేసినో సహా రెండు కేసుల్లో! మరో 22 మంది ఇతర వైసీపీ నేతలపై!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Amaravati #TDP #Chandrababu #YCP #AndhraPradesh #APNews #APpolitics #APhighcourt