కౌంటింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించిన మీనా! ఈసీఐ నిబంధ‌న‌ల మేర‌కు ఓట్ల లెక్కింపున‌కు చేసిన ఏర్పాట్ల‌పై! భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను వివ‌రించిన ఎస్పీ మల్లిక గార్గ్!

Header Banner

కౌంటింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించిన మీనా! ఈసీఐ నిబంధ‌న‌ల మేర‌కు ఓట్ల లెక్కింపున‌కు చేసిన ఏర్పాట్ల‌పై! భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను వివ‌రించిన ఎస్పీ మల్లిక గార్గ్!

  Wed May 29, 2024 08:00        Politics

నర్సరావుపేట, మే 28: పల్నాడు జిల్లాలోని పార్ల‌మెంటుతో పాటు ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి జూన్ 4న చేప‌ట్ట‌నున్న ఓట్ల లెక్కింపున‌కు ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్ల‌పై రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ కుమార్ మీనా పూర్తిస్థాయిలో సంతృప్తి వ్య‌క్తం చేశారు.రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ కుమార్ మీనా,డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్  శ్రీకేశ్ బి లత్కర్ , ఎస్ పి మల్లిక గార్గ్  త‌దిత‌రుల‌తో కలసి సమీక్షా సమావేశం అనంతరం జె ఎన్ టీ యు కాకాని లోని కౌంటింగ్ కేంద్రం ,కౌంటింగ్ ప్ర‌క్రియ చేప‌ట్టేందుకు ఇప్ప‌టికే చేసిన‌, చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈవీఎంల‌ను భ‌ద్ర‌ప‌రిచిన స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద చేసిన మూడంచెల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. తొలుత సమీక్షా సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో అంతర్గత మూవ్ మెంట్ ను నియంత్రించాలని, సి.సి. కెమరాలకు సంబంధించి సెంట్రలైజేడ కంట్రోల్ రూమును ఏర్పాటు చేయాలనీ  సూచించారు. కౌంటింగ్ జరిగేటప్పుడు ఎ మైనా అవాచనీయ సంఘటనలు కౌంటింగ్ సెంటర్లో, సెంటర్ బయట జరిగినట్లయితే సంబదిత రిటర్నింగ్ అధికారి వెంటనే స్పందించాలని తెలిపారు. కీల‌క‌మైన కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప‌లు సూచ‌న‌లు చేశారు. అధికారులు, సిబ్బంది, అభ్య‌ర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు త‌దిత‌రుల‌కు చేయాల్సిన ఏర్పాట్లతో పాటు అత్యంత కీల‌క‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై మార్గ‌నిర్దేశ‌నం చేశారు.

 

ఇంకా చదవండి: ఈసీ: ఓటు హక్కును వినియోగించుకున్న 7.05 కోట్ల మంది ఓటర్లు! ఆరో దశలో జరిగిన పోలింగ్‌లో 63.37 శాతం ఓటింగ్!

 

రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు, జాప్యం లేకుండా ఫ‌లితాల వెల్ల‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను వివ‌రించారు.పోలింగ్ రోజున ఈ.వి.యం లు ద్వంసం చేసిన కేసులలో ఉన్న వారిని, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ తర్వాత రోజున హింసాత్మక ఘటనలలో పాల్గొన వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించవద్దన్నారు రాష్ట్రానికి 20 కంపెనీల కేంద్ర బలగాలు వకేటాయించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తం పికెటింగ్ చేపట్టామన్నారు. డి.జి.పి శ్రీ హరీష్  కుమార్ గుప్తా మాట్లాడుతూ జూన్-3,4 మరియు 5 వ తేదీలలో మద్యం అమ్మకాలు నిషేదించాలని తెలిపారు. అగ్నిమాపక పరికాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలను వస్తున్న వార్తలను పరిశీలించాలన్నారు. జిల్లాలోని ఆన్ని హోటల్స్ మరియు లాడ్జిలలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. ప్రతి నియోజిక వర్గానికి ఒక పోలిస్ అధికారిని నియమించడం జరిగిందన్నారు. పోలీస్ సిబ్బందికి అదనముగా బాడీ కమేరాలను అమర్చే విధంగా చర్యలు  చేపట్టమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రికేష్ బి లాత్కర్ పి.పి.టి ప్రజంటేషన్ అనంతరం మాట్లాడుతూ ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీ త‌నంతో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించేందుకు చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. 700 మందికి పైగా కౌంటింగ్ సూప‌ర్ వైజ‌ర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జ‌ర్వర్లు త‌దిత‌రుల‌తో పాటు   ఇత‌ర సిబ్బంది కౌంటింగ్ ప్ర‌క్రియ అనుబంధ విధుల్లో పాల్గొన‌ నున్న‌ట్లు తెలిపారు.

 

ఇంకా చదవండి: నెల్లూరులో మహిళలకు శుభవార్త! ఉచిత శిక్షణ, ఉద్యోగాలు! 600మందితో మహిళా వింగ్‌ను ఏర్పాటు!

 

కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని సూక్ష్మ ప‌రిశీల‌న‌, సీసీ కెమెరాల నిఘా మ‌ధ్య ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ఎక్క‌డా ఎలాంటి గంద‌ర‌ గోళానికి తావు లేకుండా స‌రైన విధంగా బ్యారికేడింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు, వాహ‌నాల పార్కింగ్‌, మీడియా కేంద్రం ఏర్పాటు, రౌండ్ల వారీగా ఫ‌లితాల వెల్ల‌డి ప్ర‌ణాళిక‌, అభ్య‌ర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు, మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్య‌ర్థులు త‌దిత‌రుల‌కు అల్పాహారం, భోజ‌నం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌, ఈవీఎంల్లోని ఓట్ల‌ను లెక్కించే ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములుకానున్న కౌంటింగ్ సూప‌ర్ వైజ‌ర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జ‌ర్వ‌ర్లు త‌దిత‌రుల‌కు నాణ్య‌మైన శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు వివ‌రించారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజికవర్గానికి సంబందించి పోస్టల బ్యాలెట్ లెక్కింపుపై రిజర్వ్ తో కలిపి 145 మంది సిబ్బందిని, అసెంబ్లీ నియోజిక వర్గానికి సంబంధించి రిజర్వ్ తో కలిపి 131 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగినదని వార్కి ఈనెల 29వ తేదిన శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వివరించారు.

 

ఇంకా చదవండి: విజయవాడలో తీవ్ర విషాదం! ప్రాణం తీసిన కలుషిత నీరు! వందమందికి అస్వస్థత! ఆ పార్టీ వాళ్లే కారణం అని తేల్చి చెప్పిన స్థానికులు!

 

పార్లమెంట్ నియోజిక వర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 18 టేబుల్ లు, అసెంబ్లీ నియోజికవర్గానికి 15 హాల్స్ లో ఈ.వి.యం కౌంటింగ్కి 14 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 2 టేబుల్స్, మాచెర్ల, సత్తెనపల్లికి నియోజిక వర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కై 3 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 20 క్యూ ఆర్ కోడ్ స్కానర్లు ఈ.టి.పి.బి.యస్. కౌంటింగ్ కొరకు అందుబాటులో ఉన్చామన్నారు. 27 మంది సి.ఆర్.పి.యఫ్, డి.ఎ.ఆర్ సిబ్బంది -23 మంది, స్టేట్ సివిల్ పోలీస్ -34 మంది ఉన్నారని, మొత్తం 155 సి.సి. కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్ధులు కానీ లేదా వారి తరుపున ప్రతినిధులు కానీ రోజుకు 3 సార్లు స్ట్రాంగ్ రూంలను ఫిజికల్ గా పరిశీలించుకునేందుకు అవకాశం కల్పించటం జరిగిందని తెలిపారు. దీనికోసం ఒక అధికారిని నియమించటం జరిగింది అన్నారు.

 

ఇంకా చదవండి: ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీది గెలుపంటే! ఏ1 రోబో సమాధానమిదే! సోషల్ మీడియాలో బాగా వైరల్!

 

కౌంటింగ్ రోజు , ఆ తరువాత ఎంతవరకు అవసరమో అంతవరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పి.పి.టి ప్రజంటేషన్ అనంతరం యస్.పి. మల్లికా కార్గ్ మాట్లాడుతూ  క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, బందోబ‌స్తుకు చేసిన ఏర్పాట్ల‌ను వివ‌రించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా ఇప్పటివరకు 1196 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 7 ఈ.వి.యం డ్యామేజ్ కేసులలో 59 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అదేవిధముగా పోలింగ్ ముందు రోజు 33 కేసులలో 143 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని, పోలింగ్ రోజున 106 కేసులలో 883 మందిని అరెస్ట్ చేయగా పోలింగ్ తరువాతి రోజున 24 కేసులలో 203 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అవాచనీయ సంఘటనలు జరుగుకుండా ప్రతిరోజూ మానిటరింగ్ చేయడం తోపాటు ప్రజలలో హింసాత్మక ఘటనలు జరుగకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాట్లు వివరించారు. ఈ కార్యక్రమములో డి.ఐ.జి. గోపినాద్ జెట్టి, ఐ.జి.లు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, శ్రీకాంత్ , జాయింట్ కలెక్టర్ శ్రీ.ఎ.శ్యాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #Polling #EC #Menna #Media #Meeting #PoliticsResluts