ఘనంగా ఎన్టీఆర్ 101 వ జన్మదినోత్సవ వేడుకలు! టిడిపి కార్యాలయం మంగళగిరి! ఆ మహానుభావుడి ఆశయాలకు మనమందరం పునరంకితం!
Wed May 29, 2024 09:22 Politicsటిడిపి కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ 101 వ జన్మదినోత్సవ వేడుకలు
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీఆర్ 101 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాలంకరణతో వేడుకలు ప్రారంభించి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. అశోక్ బాబు మాట్లాడుతూ..తెలుగుకు వెలుగు తెచ్చింది ఎన్టీఆర్ అని కొనియాడారు. 1983 లో తెలుగుదేశం ప్రభంజనంతో ఢిల్లీకి వణకుపుట్టించి ఢిల్లీలో తెలుగు ఖ్యాతి చాటడన్నారు. ఆడవారికి ఆస్తిహక్కు, పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఇచ్చింది ఎన్టీఆరేనని, ఆయన వేసిన తెలుగుదేశం అనే చెట్టు నేడు మహావృక్షమైందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం వెగురవేయనుందని.. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని నొక్కి వక్కాణించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు:
ప్రపంచంలోని ప్రతీ తెలుగువాడు ఎన్టీఆర్ ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, నీతి, నిజాయితీ, నిర్భీతికి ఎన్టీఆర్ మారుపేరు. సినీ రంగానికి ఆయనే రాజు, రారాజు...పౌరాణికం, సాంఘికం ఏదైనా ఆయన పాత్రలో ఒదిగిపోతారు. 60 ఏళ్ల వయసులో చైతన్యరధంపై 35 వేల కిలోమిటర్ల తిరిగిన ప్రపంచంలోనే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. కుమారులు వివాహం జరుగుతున్నా పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఎంతో శ్రమించారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, మాండలిక వ్యవస్థ, పద్మావతీ మహిళా యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు గంగా, హంద్రీనీవా, గాలేరు–నగరి, నిజాం సాగర్ లాంటి ఎన్నో అభివృద్ధి కార్యాక్రమాలు ఎన్టీఆర్ చేశారు. నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి అమలవుతున్నారు. ఆ మహానుభావుడి ఆశయాలకు మనమందరం పునరంకితం కావాలి.
ఇంకా చదవండి: సోనియా గాంధీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి! తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం!
మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు:
మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయం పార్టీ స్థాపించి 42 ఏళ్లు అయింది. ప్రజలకు సేవ చేయడానికే పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నాడు ప్రారంభించిన ప్రక్కా గృహాలు, పెన్షన్, జనతా వస్త్రాలు లాంటి ఎన్నోపథకాలు దేశం అనుకరించింది. కూటమి రాజకీయాలకు పునాది వేసి జాతీయ పార్టీల ఆధిపత్యాన్ని నిలువరించిన మహానాయకుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడిపించారు. రాబోయే రోజుల్లో లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకువెళుతారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మరలా అధికారంలోకి రాబోతోంది.
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
తెలు`గు రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయ సంస్కరణలకు పునాది వేసిన నాయకుడు ఎన్టీఆర్. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయనకు ఆయనే సాటి. నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను.
ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
యుగపురుషుడు, కళా రంగ కిరీటి ఎన్టీఆర్. తెలుగుజాతి ప్రతిష్టను ప్రపంచ నలుదిక్కులా చాటాడు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ఒక సంచలనం. భారతదేశ రాజకీయలనే ఒక మలుపు త్రిప్పాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాలంటే..తెలుగుదేశం ముందు, తర్వాత అని రెండు కాలాలుగా విభజించి మాట్లాడుకునేలా ఎన్టీఆర్ చేశారు. రాజకీయల్లోకి నిజమైన యువరక్తాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ ది. ఇందిరాగాంధీనే ఎదిరించి ఫెడరల్ విధానంలో రాష్ట్ర హక్కులను కాపాడిన నాయకుడు ఎన్టీఆర్. గత ఏడాది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపాం. ‘రమే రామే మనో రమే’ అనే పేరుతో ఎన్టీఆర్ పై పుస్తకం తీసుకొస్తున్నాం. టీజర్ ను సాయంత్రం విడుదల చేయబోతున్నాం. పుస్తకాన్ని రాబోయే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా విడుదల చేస్తాం.
ఇంకా చదవండి: ఆయన చేసిన సేవలకు ‘భారతరత్న’ పురస్కారం! తెలుగువారి ఈ చిరకాల కోరిక!
విపత్తుల్లో జోలి పట్టుకుని తెలుగు జాతిని ఆదుకున్న నాయకుడు ఎన్టీఆర్. దిగజారుతున్న నేటి రాజకీయాలను బాగు చేయాలంటే ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్టీఆర్ సంక్షేమ సిద్దాంతం...చంద్రబాబు నాయుడి అభివృద్ధి మంత్రం తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష. పరిపాలకుడు ప్రజల ఆస్తుల విలువను పెంచాలి. ఆస్తులను నాశనం చేయరాదు. రైతుల మోటార్లకు ఎన్టీఆర్ హార్స్ పవర్ తీసుకురావడంతో వారి భూముల విలువ రెండు, మూడు రెట్లు పెరిగాయి.
శాసనమండలి సభ్యులు దువ్వారపు రామారావు
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంక్షేమ కార్యక్రమాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రాబోయే తరాలకు స్పూర్తిదాయకమైన నాయకత్వాన్ని ఎన్టీఆర్ అందించారు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారు పార్టీని విజయవంతంగా నడిపిస్తారు.
మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
పార్టీ పెట్టిన అతి కొద్ది కాలంలో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. బడుగు, బలహీన వర్గాలకు నాయకత్వం ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి అభివృద్ధి నడిపించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సమస్యలు సమసిపోవాలంటే ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలి.
ఇంకా చదవండి: అన్నగారికి నివాళులు అర్పించిన బాలయ్య! ఎన్టీఆర్ ఘాట్ వద్ద!
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో తెలుగురైతు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
అధికారం కొన్ని కులాలకే పరిమితమైన పరిస్థితుల నుంచి అధికారాన్ని బడుగులకు అందించి అంబేడ్కర్ రాజ్యాంగ స్పూర్తిని నిలపడం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. వెయ్యి జయంతులు వచ్చిన తెలుగుజాతి ఎన్టీఆర్ ను మరిచిపోరు.
అధికారప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు
బడుగు, బలహీన వర్గాలకు అధికారాన్ని తీసుకొచ్చిన యుగపురుషుడు. రాజకీయలు, విప్లవాలు వేరని పెద్దలు అంటారు. కానీ రాజకీయాల్లో విప్లవాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్.
బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనందసూర్య
పేదవాడి కడుపు ఆకలి తీర్చిన యుగపురుషుడు ఎన్టీఆర్. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాలను ఏర్పాటు చేయాలి.
ఇంకా చదవండి: ఎన్టీఆర్ ఆశయ సాధనే తెలుగుదేశం పార్టీ అజెండా! ఆరాధ్య కథానాయకుడు ఎన్టీఆర్!
మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్ రామకృష్ణ
ఎన్టీఆర్ అంటే ఒక బ్రాండ్. ఆయన నిలుచుంటే ఒక హుందాతనం. రాష్ట్రంలో ఏ నలుగురు కలిసిన ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చే నడుస్తోంది. టీచర్లు ఎన్నికల విధుల్లో పాల్గొన వద్దని చెప్పిన జగన్ రెడ్డిని టీచర్లే ఓడించబోతున్నారు. వారం రోజుల్లో జగన్ రెడ్డి అనే రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలబోతోంది.
గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు
ఎన్టీఆర్ ది మరణం లేని జననం. చాలామంది జీవిస్తూ..మరణిస్తూ ఉంటారు..కానీ, ఎన్టీఆర్ మరణించి జీవించి ఉన్నాడు. ఎన్టీఆర్ ఒక తరాన్ని ప్రభావితం చేశాడు. ఒక తరాన్ని శాశించాడు. ఒక తరానికి మార్గదర్శకంగా ఉన్నాడు. గలగలా పారే గోదారిని అడిగినా, బిరబిరా పారే కృష్ణమ్మను ప్రశ్నించినా, ఉత్తుంగ తరంగ తుంగభద్రను కదిలించినా ఆ పవిత్ర నదుల హృదయ స్పందన ఒక్కటే...ఎన్టీఆర్, ఎన్టీఆర్. తూరుపు కనుమల్లో మండే సూర్యుడిలాప్రభవించాడు. జనంగుండె గొంతుకల్లో విప్లవ గీతమై ప్రతి ధ్వనించాడు. బూర్జువా భావజాల వ్యవస్థలపైన భూస్వామ్య ఫ్యూడల్ ప్రభువుల రణకడ్గం జులిపించాడు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నిదానం నేటికీ తెలుగు ప్రజల హృదయాల్లో జాతీయ గీతంలా మారుమోగుతోంది. తెలుగు జాతి చరిత్ర తిరగరాసిన ఆయన చరిత్ర భావి తరాలకు భగవద్గీత కావాలి. నూటికి ఒక్కడు..కాదు. కోటికి ఒక్కడు..కాదు..యుగానికి ఒక్కడు..యుగపురుషుడు.
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రేపు రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు? వేడుకల్లో టీడీపీ శ్రేణులు!
రాష్ట్ర చరిత్రలోనే రూ. వేల కోట్ల కుంభకోణం! జన సేన మూర్తి!
సీ ఎస్ పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన మూర్తి యాదవ్! కేవలం 15 రోజుల్లో రిజిస్ట్రేషన్!
నింగిలోకి వెళ్లాల్సిన రాకెట్ ప్రయోగం వాయిదా! సెమీ క్రయోజనిక్ ఇంజిన్!
నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ? యువతకు సాంకేతిక శిక్షణ!
హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్! పిటిషన్ వేసిన పిన్నెల్లి!
కృష్ణా: పెడనలో రూ.3.72 కోట్ల స్వాహా! ఫేక్ అకౌంట్లకు మళ్లింపు!
వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష? కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలీ!
వృద్ధుల చావుకు కారకులైన అధికారులు? ఇళ్ల వద్దే పింఛన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #andhrapradesh #tdp #mangalagiri #tdpoffice #devineniuma #NTR #101NTR #delhi #news #todaynews
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.