టీడీపీదే గెలుపు! వైసీపీ నేత పందెం! అడ్వాన్స్ ఇచ్చి కాగితం రాయించుకుని మరీ! అసలు ఎంత బెట్టింగ్ అంటే!

Header Banner

టీడీపీదే గెలుపు! వైసీపీ నేత పందెం! అడ్వాన్స్ ఇచ్చి కాగితం రాయించుకుని మరీ! అసలు ఎంత బెట్టింగ్ అంటే!

  Fri May 31, 2024 21:06        Politics

తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో బెట్టింగ్ వ్యవహారం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదిరి నియోజకవర్గంలో గెలుపు, ఓటములపై ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతల మధ్య పందెం ఒప్పందానికి సంబంధించిన పేపర్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఒకరేమో కదిరిలో తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని పందెం వేయగా.. మరొకరేమో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని.. ఏకంగా రూ.10 లక్షలు పందెం వేయడం విశేషం. ఒకే పార్టీకి చెందిన నేతలు ఇలా పందాలకు దిగడం చర్చనీయాంశమైంది. వైఎస్సార్‌సీపీకి చెందిన నేత కదిరిలో టీడీపీ గెలుస్తుందని పందెం వేయడం చర్చనీయాంశమైంది.

 

ఇంకా చదవండి: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. పట్టపగలే నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపాడు! దీనివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏమిటిరా?

 

కదిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని నల్లచెరువు మండల నాయకుడు.. తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని గాండ్లపెంట మండల వైఎస్సార్‌సీపీ నాయకుడు పందెం వేశారు. వీరిద్దరి మధ్య జరిగిన పందెం ఒప్పందానికి సంబంధించిన ఓ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు నేతలు ఏకంగా రూ.10 లక్షలకు బెట్టింగ్‌కు దిగడం చర్చనీయాంశమైంది. అయితే వైఎస్సార్‌సీపీ నేతలే టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్‌‌లకు దిగుతున్నారంటూ కొందరు ఆ పార్టీ సానుభూతిపరులు ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేపర్‌లో.. ' పందెం విలువ రూ.10 లక్షలు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కదిరి అసెంబ్లీ సీటు వైఎస్సార్‌సీపీకి వస్తుందని బీ విశ్వనాథ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి.. టీడీపీ వస్తుందని ఏ రామాంజులరెడ్డి చెప్పినారు. దీనికి పందెం ఒప్పందం చేసుకోవడం జరిగింది. కదిరిలో వైఎస్సార్‌సీపీ గెలిస్తే మొత్తం డబ్బులు రూ.20 లక్షలు విశ్వనాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి ఇచ్చే విధంగా.. కదిరిలో టీడీపీ గెలిస్తే మొత్తం డబ్బులు రూ.20 లక్షలు రామాంజులరెడ్డికి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయదలచి.. ఏ రామాంజులరెడ్డి రూ.10లక్షలు.. విశ్వనాథ్ రెడ్డి రూ.10లక్షలు మొత్తం కలిపి రూ.20 లక్షలు.. ఎల్ లోకేశ్వర్ రెడ్డి సార్ దగ్గర పెట్టడం జరిగింది. దీనిలో మెజార్టీకి సంబంధం లేదు.. కేవంలో గెలుపు మాత్రమే'అని రాసుకున్నారు. ఈ పేపర్‌లో ఇరువురు సంతకాలు చేశారు. విచిత్రంగా వైఎస్సార్‌సీపీ నేతల మధ్య బెట్టింగ్ జరగడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఇలా బెట్టింగ్‌లు నిర్వహించడం చట్ట విరుద్ధం.. కానీ కొందరు ఇలా పందాలు వేసి ఒప్పందాలు చేసుకుంటున్నారు.



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!

 

విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!

 

చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్

 

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!

 

బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!

 

కెనడా: అంతర్జాతీయ విద్యార్ధులకు గుడ్ న్యూస్! రెండు సంవత్సరాల పోస్ట్-స్టడీ వర్క్ పొడిగింపు! ఆనందంలో స్టూడెంట్స్!

 

తస్మాత్ జాగ్రత్త... విశాఖలో పట్టుబడ్డ గ్యాంగ్! విదేశాల్లో ఐటీ ఉద్యోగాలని ఘరానా మోసం! ముగ్గురు ఏజెంట్ లు అరెస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #APpolitics #APNews #TDP #YCP #CM #betting #TDPWinnerbetting #YCPbetting