చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత!

Header Banner

చంద్రబాబు ఢిల్లీలో నేడు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ! హాజరుకానున్న ఎన్డీఏ అధినేత!

  Wed Jun 05, 2024 11:59        Politics

ఢిల్లీ బయల్దేరిన టీడీపీ అధినేత చంద్రబాబు - సాయంత్రం ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు - ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ - ఎన్డీఏతోనే మా ప్రయాణమన్న చంద్రబాబు - ప్రమాణస్వీకారానికి ఢిల్లీ పెద్దలను ఆహ్వానించనున్న చంద్రబాబు

 

ఇంకా చదవండి: ఏపీలో చంద్రబాబు సునామి - మోడీ! ఇకపై రోజుకు 18 గంటలు పని చేస్తా! అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్!

 

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సూపర్‌ విక్టరీ సాధించింది. దీంతో.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు హస్తినబాట పట్టనున్నారు టీడీపీ చీఫ్. ఇక, ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాగా, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బంపర్‌ విక్టరీ కొట్టింది. అటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్న బీజేపీ మెజార్టీ సాధించింది. దీంతో, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి చెందిన పార్టీల అధ్యక్షులు పాల్గొననున్నారు. 2014, 2019 ఎన్నికల్లో సొంతంగా మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన బీజేపీ. ఈ సారి మాత్రం ఆ మార్క్‌ను చేరుకోలేకపోయింది. దీంతో, ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల మద్దతు తప్పనిసరి అయ్యింది. దాంతో, ఈ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ భేటీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీష్‌ కుమార్‌ సహా కూటమిలోని ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు.

 

ఇంకా చదవండి: వైసీపీ నేత ముద్రగడ ప్రతిజ్ఞ! పవన్‌ గెలుపుతో పేరు మార్చనున్నారట!

 

ఇక, ఎన్డీఏ కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ పార్టీకి సొంతంగా 241 సీట్లు వచ్చాయి. 16 సీట్లతో టీడీపీ రెండో స్థానంలో ఉంది. 12 సీట్లతో జేడీయూ మూడో స్థానంలో ఉంది. చంద్రబాబు, నితీష్‌ కుమార్‌. ఇప్పుడు ఎన్డీఏలో కింగ్‌ మేకర్లు. ఎన్డీఏ కూటమిలో వారి పాత్ర కీలకంగా మారింది. దాంతో.. ఈ రోజు సాయంత్రం జరిగే సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలోనే ఎన్డీఏ కన్వీనర్‌ని ఎన్నుకునే అవకాశం ఉంది. మరో వైపు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డాను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. ఏపీలో కూటమి గ్రాండ్‌ విక్టరీ కొట్టడంతో మరోసారి ముఖ్యమంత్రి కానున్నారు చంద్రబాబు. ఆయన ప్రమాణస్వీకారానికి ఢిల్లీ పెద్దలను కూడా ఆహ్వానించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఢిల్లీ పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం 11 గంటలకు బయల్దేరి ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు.

 

ఇంకా చదవండి: ప్రజల నమ్మకాన్ని చాటిన కూటమి! కీలక బాధ్యతలు అప్పగించిన ప్రజలు! కూటమి విజయం పై మోదీ అభినందనలు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

కూటమి విజయం అనంతరం! చంద్రబాబు రాకకై పెద్దలు! నేడు NDA నేతలతో! ఢిల్లీలో ఆంధ్ర కు మహర్దశ!

 

ప్రజలు మాకు పవిత్రమైన బాధ్యత అప్పగించారు! వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు.. లోకేశ్

 

5 సంవత్సరాలు అధికారంలో ఏం చేశాడో... ఇప్పుడు సమీక్షిస్తాడంట! విజయసాయిరెడ్డి కామెంట్స్!

 

టీడీపీ ఏజెంట్ రమేష్‍ కు గుండెనొప్పి! 108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు!

 

నరసరావుపేటలో భద్రత పెంపు! ప్రధాన పార్టీల అభ్యర్థుల ఇళ్ల వద్ద ఇనుప కంచెలు, బారికేడ్లు!

 

వైసీపీకి సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ! పిటిషన్ తోసిపుచ్చిన న్యాయస్థానం!

 

ఈరోజు రాత్రి పది నుండి గుంటూరు విజయవాడ హైవే బంద్! అన్ని రకాల వాహనాలకు అనుమతి లేదు! కౌంటింగ్ స్టాఫ్ కి మాత్రమే!

 

నేతల భద్రతలో మార్పులు అనే వార్తలు అవాస్తవం! మంగళగిరి డి ఎస్ పి!

 

సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల!

 

సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న సాక్షి! ఛానల్ లో మాత్రమే ఇలా!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #ChandrababuNaidu #Delhi #AndhraPradesh #Politics