సోనియా, రాహుల్ గాంధీలకు కీలక పాత్రలు! కాంగ్రెస్ కీలక సమావేశంలో కొత్త బాధ్యతలు ఏంటో తెలుసుకోండి!

Header Banner

సోనియా, రాహుల్ గాంధీలకు కీలక పాత్రలు! కాంగ్రెస్ కీలక సమావేశంలో కొత్త బాధ్యతలు ఏంటో తెలుసుకోండి!

  Sat Jun 08, 2024 21:10        Politics

సోనియా గాంధీ మరోసారి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. 2024, జూన్ 8వ తేదీన జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగింది, దీనికి రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శశి థరూర్, అజయ్ మాకెన్, కార్తీ చిదంబరం, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ సహా పలువురు పార్టీ ప్రముఖులు హాజరయ్యారు.

 

ఇంకా చదవండి: చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!

 

సోనియా గాంధీ పేరును మొదట కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా, గౌరవ్ గొగోయ్, తారిఖ్ అన్వర్, కె సుధాకరన్ వంటి నేతలు సమర్థించారు. ఎంపీలు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. అదే రోజు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా వెల్లడిస్తామని కేసీ వేణుగోపాల్ తెలిపారు.

 

ఇంకా చదవండి: నీట్ పరీక్ష ఫలితాల్లో అనుమానాస్పద ఘటనలు! వెంటనే దర్యాప్తు చేపట్టాలన్న ప్రియాంక!

 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లను గెలుచుకొని మెరుగైన ఫలితాలు సాధించింది. ఇండియా కూటమి కూడా మంచి సీట్లను కైవసం చేసుకుంది. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎంపిక చేయడం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో ఆయనను స్పీకర్ అధికారిక ప్రతిపక్ష నేతగా ప్రకటించనున్నారు.

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి

 

చంద్రబాబు ప్రమాణస్వీకారం! హాజరుకానున్న మోదీ, ఎన్డీఏ నేతలు!

 

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య! పోలీసులపై నాని ఆగ్రహం!

 

తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు గారికి రేపు చివరి వీడ్కోలు! ప్రముఖుల హాజరు!

 

తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీ రావు గారు ఇక లేరు! యావత్ దేశానికి ఆ ఊహే కష్టం గా వుంది!

 

అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP కొత్త సీఎస్ పదవి కి ! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #SoniaGandhi #RahulGandhi #CongressLeadership #KeyRoles #ParliamentaryParty #PoliticalUpdates #IndianPolitics #CongressMeeting #OppositionLeader #KeyDecisions