పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!

Header Banner

పెమ్మసాని గతంలో నిర్వహించిన వివిధ హోదాలు! గుంటూరు గర్వించే విజయం! అమరావతికి సముచిత స్థానం!

  Mon Jun 10, 2024 06:54        Politics

న్యూఢిల్లీ: కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ ఎంపీ పెమ్మసాని. మెున్న వైద్యుడు, నిన్న వ్యాపారవేత్త, నేడు కేంద్ర మంత్రి- పెమ్మసాని విజయ ప్రస్థానమిది.

ఈ ఎన్నికల ముందే, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి, గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది, కేంద్ర క్యాబినెట్‌లో చోటు సంపాదించిన పెమ్మసానిపై ప్రత్యేక కథనం.

 

ఇంకా చదవండి: వైద్య విద్యార్థులకు ఆన్‍లైన్ శిక్షణ! 'యు వరల్డ్' ప్రారంభించిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్!

 

తొలిసారి ఎన్నికల్లో పోటీచేసి, గుంటూరు ఎంపీగా మంచి మెజార్టీతో గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని అమెరికాలో స్థిరపడి, వైద్యరంగంలో ఉన్నతస్థానాలకు ఎదిగారు. సొంత ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో, రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని.. తొలి ప్రయత్నంలోనే ప్రజల మద్దతు పొంది.. కేంద్ర క్యాబినెట్‌లో చోటు సంపాదించారు.

ఈ ఎన్నికల ముందే, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు పార్లమెంట్‌ స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్లిన ఆయన ఆనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్యవిద్య లైసెన్సింగ్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం..'యు వరల్డ్‌' ఆన్‌లైన్‌ సంస్థను ప్రారంభించి.., స్వల్ప వ్యయంతో వారికి శిక్షణ అందించారు. ఆ తర్వాత ఈ సంస్థ..వివిధ కోర్సుల్లో పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ ఇస్తూ అతికొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలకు ఎదిగింది. అంతర్జాతీయంగా ఆయనకున్న అనుభవం... రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం.. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో ఉపకరిస్తుందనే ఉద్దేశంతో... ఆయనను కేంద్ర మంత్రి పదవికి చంద్రబాబు ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.

 

ఇంకా చదవండి: తండ్రి రికార్డును బద్దలు కొడుతూ! రామ్మోహన్ నాయుడు 26 ఏళ్లకే మంత్రి!

 

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్‌.. తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. ఎంబీబీఎస్, ఎండీ పూర్తిచేసిన చంద్రశేఖర్‌ వయసు 47 ఏళ్లు. భార్య డాక్టర్‌ శ్రీరత్న. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు చిరపరిచితులు. చంద్రశేఖర్‌.. ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి... ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీజీ చదవడం కోసం అమెరికా వెళ్లిన ఆయన.. అక్కడ యునైటెడ్ స్టేట్స్‌ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్‌ పూర్తి చేయడంలో..వసతి, శిక్షణ కోసం అధిక వ్యయం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో జనరల్‌ గైసింగర్‌ వైద్య కేంద్రం నుంచి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ చాటారు.

 

అమెరికాలోని డాలస్‌లో పెమ్మసాని ఫౌండేషన్‌ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. తొలి నుంచి తెలుగుదేశంతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్‌... ఎన్నారై విభాగం తరఫున క్రియాశీలకంగా వ్యవహరించారు. 2014లో నరసరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖారరైనప్పటికీ, అప్పటి రాజకీయ పరిణామాల నడుమ రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగారు. దీంతో ఆ ఎన్నికల్లో రాయపాటి పోటీలో నిలిచారు.

 

ఇంకా చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులకు సర్కారు సర్‌ప్రైజ్! ఉపాధ్యాయుల కోరికపై సెలవులు మరింత పొడిగింపు!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి

 

సమాచార శాఖలో స్కాం బాంబ్! నంద్యాల సీనియర్ పాత్రికేయుడు చలం బాబు ఫిర్యాదుతో కలకలం!

 

టీడీపీకి కేంద్రంలో రెండు కీలక మంత్రి పదవులు! రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?

 

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ భూకంపం! ఎవరు ఉద్యోగాల నుంచి బయటకు?

 

భారీ వర్షాల అలర్ట్! 12 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు!

 

అమరావతిలో నిర్మాణ పనులకు ఊపందించిన కమిషనర్! ప్రత్యేక ఆదేశాలతో పరిశీలన!

 

తెలుగు మీడియా దిగ్గజం రామోజీరావు గారికి రేపు చివరి వీడ్కోలు! ప్రముఖుల హాజరు!

 

తెలుగు జాతి ముద్దు బిడ్డ రామోజీ రావు గారు ఇక లేరు! యావత్ దేశానికి ఆ ఊహే కష్టం గా వుంది!

 

అటవీశాఖ అదనపు సీఎస్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా! AP కొత్త సీఎస్ పదవి కి ! ఎవరు బాధ్యత వహించ బోతున్నారు?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #AndhraPradesh #GunturPride #PoliticalJourney #LeadershipGoals #VijayamForGuntur #ChandrashekarPemmasani #CentralMinister #RisingStar #PoliticalMilestone #TeluguLeader #NationwideRecognition