ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!

Header Banner

ఎన్నికల్లో గోడవలపై సిట్ నివేదిక! పోలీసుల వైఫల్యం!

  Tue Jun 11, 2024 09:11        Politics

ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై పూర్తి సిట్ బృందం నివేదిక సమర్పించింది. డీజీపీ కార్యాలయానికి సిట్ నివేదికను సమర్పించింది. 264 పేజీలతో రెండు వాల్యూమ్‌లుగా సిట్ నివేదిక అందచేసింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. హింసాత్మక ఘటనల్లో 37 కేసులు నమోదు చేసినట్లు సిట్ వెల్లడించింది. ఇప్పటికే 6 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్టు సిట్ వెల్లడించింది. ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు 2 ఉన్నట్లు సిట్ నివేదికలో తేలింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

పల్నాడు జిల్లాలో పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపట్టలేదన్న సిట్ నివేదించింది. నిందితుల్ని ప్రశ్నించకపోవడం, సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదన్న సిట్ తెలిపింది. నిందితుల్ని ఎఫ్ఐఆర్‌లో ఆగంతుకులుగా నమోదు చేయడంపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితులు ఎవరో తెలిసినా అరెస్టు చేయలేదని సిట్ నివేదికలో పేర్కొంది. నిందితులకు శిక్ష పడేవరకు ఎస్పీలు, డీఐజీలు పర్యవేక్షించాలని సిట్ ఆదేశించింది. కొన్ని ఘటనల్లో ఆధారాలను పోలీసులు సేకరించలేకపోయారని సిట్ ఆరోపించింది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో బీఎల్వో ఆలస్యంగా ఫిర్యాదు చేశారని సిట్ తెలిపింది. ప్రిసైడింగ్ అధికారి అసలు ఫిర్యాదు చేయలేకపోవడాన్ని సిట్ బృందం ప్రశ్నించింది. తుది నివేదికను ఈసీకి పంపాలని సిట్ స్పష్టం చేసింది. 

 

ఇవి కూడా చదవండి 

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాపై సౌతాఫ్రికా సంచలన విజయం! అతి తక్కువ స్కోర్! 

 

రైతు రుణమాఫీకి విధివిధానాలు ఖరారు చేయండి! రేవంత్ రెడ్డి! 

 

ఐదేళ్ల కిందట వైసీపీ ప్రారంభించిన హింసే ఇంకా కొనసాగుతోంది! పట్టాభి వ్యాఖ్యలు! 

 

మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి! కిషన్ రెడ్డి వ్యాఖ్యలు! 

 

మోడీ కేబినెట్ లో ఉన్న మంత్రులు వీరే! తెలుగు వారు? 

 

వైసీపీ పాలనలో నాపై హత్యాయత్నం జరిగింది! గుంటూరు ఎస్పీకి RRR ఫిర్యాదు! 

 

మేఘాలయా లో స్వల్ప భూకంపం! భయంతో పరుగులు తీసిన ప్రజలు! 

 

ఒడిపోయాక కూడా ఆగని వైసీపీ అకృత్యాలు! చింత చచ్చినా పులుపు చావలేదు! 

 

అమరావతిలో జెట్ స్పీడ్ లో జరుగుతున్న పనులు! ఆనందంలో రైతులు! 

                                           

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Politics #Elections #Palnadu #Macharla #AndhraPradesh