రాజధాని నిర్మాణం టాప్-5లో ఉండేందుకు కట్టుబడి ఉన్నాం! 48 వేల కోట్ల పనులు వేగవంతం! మున్సిపల్ శాఖలో అమరావతి కీలకం!

Header Banner

రాజధాని నిర్మాణం టాప్-5లో ఉండేందుకు కట్టుబడి ఉన్నాం! 48 వేల కోట్ల పనులు వేగవంతం! మున్సిపల్ శాఖలో అమరావతి కీలకం!

  Sun Jun 16, 2024 14:53        Politics, అమరావతి - The Capital

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, మున్సిపల్ శాఖలో ముఖ్యమైంది అమరావతేనని, రెండున్నరేళ్లలో అమరావతిలో కీలకమైన నిర్మాణాలు, పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంత్రి నారాయణ సెక్రటేరియట్, అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళతామన్నారు. 3600 కి.మీ రోడ్లతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామన్నారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే అమరావతి నిర్మాణం చేపడతామని, ఎలాంటి మార్పు లేదన్నారు.

 

ఇంకా చదవండి: రెండున్నర సంవత్సరాల్లో అమరావతిని అత్యుత్తమ రాజధానిగా! నిర్మిస్తామని నారాయణ ధీమా!

 

217 చ.గజాల్లో గతంలో 48 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా అమరావతి ఉండాలని సీఎం చంద్రబాబు లక్ష్యమని, అలా నిలుపుతామని మంత్రి తెలిపారు. రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటలు ఆడిందని విమర్శించారు.

 

రైతుల కౌలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. గతంలో తనకున్న అనుభవంతో ప్రపంచంలో టాప్‌-5లో ఒకటిగా ముందుకు తీసుకెళతామని చెప్పారు. గత ప్రభుత్వంలో 48 వేల కోట్లతో అమరావతి కోసం టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టామని తెలిపారు. ఏ ఒక్క చిన్న లిటిగేషన్ లేకున్నా, గత ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపివేసిందన్నారు. భూములిచ్చిన రాజధాని రైతులను గత ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వైసీపీ పాలనతో విసుగు చెంది ప్రజలు ఎన్డీఏకు అధికారం ఇచ్చారని అన్నారు.

 

ఇంకా చదవండి: కొత్త ఆరోగ్య శాఖ మంత్రిగా! సత్యకుమార్ యాదవ్ బాధ్యతలు స్వీకరణ!

 

త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పదిహేను రోజుల్లో అధ్యయనం చేసి టైమ్ బౌండ్ నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. రాజధాని పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తామో చెబుతామని, మూడు దశల్లో రాజధాని అమరావతిని నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించి అమలు చేశామని చెప్పారు. రాజధానిలో తొలి ఫేజ్ పనులకు 48 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. మూడు ఫేజుల్లో కలిపి రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చవుతాయని, రాజధాని పై కోర్టుల్లో ఉన్న కేసులపై స్టడీ చేసి సానుకూలంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని రైతులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజధానిలో రోడ్ల ధ్వంసం సహా దొంగతనాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, కమిటీ వేసి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

 

ఇంకా చదవండి: విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం! మంత్రి నారా లోకేష్ సమీక్ష!

 

మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

ఇవి కూడా చదవండి:

 

ఏయూలో అవకతవకలపై LAW విద్యార్థిని! ఫిర్యాదు పై మంత్రి లోకేష్ స్పందన!

 

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులు! వృద్ధులకు అదనపు ప్రయోజనాలు!

 

ఏపీలో నైరుతి రుతుపవనాల దెబ్బ! ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు!

 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లల్లో కొత్త వెలుగులు! అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం!

 

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజల కలకలం! ఇది ఏంది అయ్యా ఇది, నేను ఎప్పుడూ చూడలే!

 

సీఎంగా చంద్రబాబు తొలి ప్రాజెక్టు పర్యటన! సోమవారం పోలవరం పరిశీలన!

 

పార్టీ సేవలకు నామినేటెడ్ పదవులు! సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్!

 

పంటలకు అవసరమైన విత్తనాలు! ఎరువుల సరఫరా విషయంలో! జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి  కీలక ఆదేశాలు!

 

తాగుబోతులకు గుడ్ న్యూస్! నాసిరకం జేబ్రాండ్లపై బ్యాన్, మద్యం ధరలు తగ్గిస్తామన్న మంత్రి ప్రకటన!

 

కర్నూలుకు కొత్త రూపం! పారిశుధ్యం, మౌలిక సౌకర్యాలపై మంత్రి టీజీ భరత్ సమీక్ష!

 

పుంగనూరులో రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు! పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు!

 

తుంబిగనూరులో వైసీపీ నేతల క్రూరత్వం! వైసీపీకి ఓటు వేయలేదని గ్రామస్తులను చంపే ప్రయత్నం!

 

గృహనిర్మాణశాఖ మంత్రిగా కొలుసు పార్థసారథి! నూతన బాధ్యతలపై ఉత్సాహంతో మంత్రి!

 

AP DSC నోటిఫికేషన్ విడుదల! నిరుద్యోగుల ఆశలు చిగురించాయి!

 

ఉదయం 4 గంటలకు! AP మంత్రుల ఫైనల్ జాబితా విడుదల! ఇదే లిస్ట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:               

Whatsapp group

Telegram group

Facebook group 


   #Amaravati #CapitalCity #MunicipalAffairs #Top5Capital #Narayana #Development #AP #MasterPlan #Chandrababu #CapitalConstruction #APGovernment