ఏపీ మంత్రివర్గ భేటీ! వాలంటీర్లు, అమరావతిపై కీలక నిర్ణయం! ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు!

Header Banner

ఏపీ మంత్రివర్గ భేటీ! వాలంటీర్లు, అమరావతిపై కీలక నిర్ణయం! ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు!

  Sat Jun 22, 2024 14:24        Politics

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారిగా మంత్రివర్గం సమావేశం అవుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవం, అమరావతి లో పర్యటించారు. ఈ రెండు కొత్త ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలుగా ఉన్నాయి. ఇక..ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పైన కసరత్తు ప్రారంభం అయింది. అందులో భాగంగా పెన్షన్లను రూ 4 వేలకు పెంచుతూ సీఎం చంద్రబాబు ఇప్పటికే సంతకాలు చేసారు. అయితే, పెన్షన్ల పంపిణీ లో వాలంటీర్లను కొనసాగించాలా.. ప్రత్యామ్నాయ మార్గాల్లో ముందుకు వెళ్లాలా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు సైతం తిరిగి తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు.

 

ఇంకా చదవండి: పోలీసులు గూటికి భారతి పిఏ! పులివెందుల లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితి! వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్!

 

కొత్త వాలంటీర్ల భర్తీ విధానంలో అనుసరించాల్సిన విధానం పైన చర్చించనున్నారు. అదే విధంగా గతంలో పని చేసిన వారిని కొనసాగించాలా వద్దా అనే అంశం పై తుది నిర్ణయం జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా అమరావతి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని పైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. ముందుగా సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం అమరావతికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అప్పీల్ కు వెళ్లింది. ఆ కేసు విచారణలో ఉంది. దీని పైన న్యాయపరంగా ఏం చేయాలో ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. రాష్ట్రంలోని ఆర్దిక పరిస్థితి గురించి కేబినెట్ భేటీలో మంత్రులకు ప్రత్యేకంగా వివరించనున్నారు. రాష్ట్రంలోని ఆర్దిక స్థితి గతులు, అమరావతి, పోలవరం పైన శ్వేత పత్రాల విడుదలకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం కాల పరిమితితో తమ ప్రాధాన్యతా అంశాలను ఖరారు చేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లే అంశం పైన చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో.. కూటమి ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

తాడేప‌ల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయ‌డంపై! అర్ధ రూపాయి డైలాగ్ చెప్తు జగన్ ట్వీట్!

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!

 

ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!

 

ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #AndhraPradesh #APPolitics #TDPJanasenaBJP #Chandrababu #Volunteers #Amaravati #TDPMeeting