స్పీకర్ అయ్యన్న పాత్రుడి జీవితాన్ని చాలా గొప్పగా వివరించిన సీఎం చంద్రబాబు! ఏ పదవి ఇచ్చినా వన్నె తెస్తారని ప్రశంసలు!

Header Banner

స్పీకర్ అయ్యన్న పాత్రుడి జీవితాన్ని చాలా గొప్పగా వివరించిన సీఎం చంద్రబాబు! ఏ పదవి ఇచ్చినా వన్నె తెస్తారని ప్రశంసలు!

  Sat Jun 22, 2024 14:38        Politics

ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం:

అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరు.. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న.. 66 ఏళ్ల వయస్సు ఉన్నా అయ్యన్న ఇప్పటికీ ఫైర్ బ్రాండే.. నీతి, నిజాయతీ, నిబద్దతను పుణికిపుచ్చుకొని రాజకీయాలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న నాయకుడు అయ్యన్న.. అయ్యన్న గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయ్యన్నపై అనేక పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టి వేధించారు. 23 కేసులు పెట్టినా అయ్యన్న రాజీలేని పోరాటం చేశారు. చట్టసభకు రావడం అరుదైన గౌరవం... మనందరిపై పవిత్ర బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలి.. సమర్థంగా పనిచేస్తే గౌరవం దానంతట అదే వస్తుంది.

 

ఇంకా చదవండి: ఏపీ మంత్రివర్గ భేటీ! వాలంటీర్లు, అమరావతిపై కీలక నిర్ణయం! ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు!

 

ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసింది. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బందిపెట్టారు. నా కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారు. నాకు మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆరోజే గట్టిగా చెప్పా. కౌరవ సభకు రాను.. గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశా.. రాష్ట్రంలోని అడపడచులను అవమానించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టారు. ప్రజలు అంతా గమనించి.. నన్ను గౌరవ సభకు పంపారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలి.. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు.. మళ్లీ జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలి. తెలుగుగడ్డ రుణం తీర్చుకోవాలనేదే నా కోరిక. ఆనాడు 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారు. ఇవాళ కూటమికి 164 సీట్లు వచ్చాయి.. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. పవన్‍ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని విమర్శించారు. ఇవాళ 21 సీట్లలో పోటీచేసి అన్ని స్థానాల్లో గెలిపించిన వ్యక్తి పవన్. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ గెలవాలో తెలిసిన వ్యక్తి పవన్. వైనాట్ 175 అని చెప్పి 11 తెచ్చుకున్న పరిస్థితి చూశాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

తాడేప‌ల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేయ‌డంపై! అర్ధ రూపాయి డైలాగ్ చెప్తు జగన్ ట్వీట్!

 

అమెరికా: విమర్శలు ఎదుర్కుంటున్న ట్రంప్ ఎన్నికల ప్రతిపాదన! విద్యార్ధులు మాత్రం ఫుల్ హ్యాపీ!

 

యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం! ఆ కేసుల్లో అబార్షన్లకు గ్రీన్ సిగ్నల్!

 

రోజురోజుకీ పెరుగుతున్న హజ్ మృతుల సంఖ్య! భారతీయులు ఎందరో తెలిస్తే అవాక్కే!

 

సైబర్ నేరగాళ్ల కొత్త ప్రయత్నాలు! మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా! స్పందించారో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ చేస్తారు!

 

ఇకపై నాణ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం! ఈవో ఆదేశాలు జారీ! పోటు కార్మికులతో సమావేశం!

 

ప్రతిరోజూ లెమన్ గ్రాస్ టీ తాగితే! గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందా!

 

ఆత్మహత్య చేసుకోబోయిన యాంకర్ రష్మి! దానికి కారణం అదేనా? వెలుగులోకి షాకింగ్ విషయాలు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Chandrababu #AyyannaPatrudu #APSpeaker #TDP-JanaSena-BJPAlliance