రేపు రాత్రి ఢిల్లీ చేరుకొనున్న సీఎం చంద్రబాబు! ఎందుకంటే!

Header Banner

రేపు రాత్రి ఢిల్లీ చేరుకొనున్న సీఎం చంద్రబాబు! ఎందుకంటే!

  Tue Jul 02, 2024 20:39        Politics

ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. హామీల్లో చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారంలోకి రాగానే సీఎం హోదాలో మొదటి సంతకం మెగా డీఎస్సీ పై చేశారు. అదే విధంగా జులై 1వ తేదీన పెన్షన్ పెంచి ఇంటింటికి వచ్చి ఇస్తామని చెప్పారు. నిన్న పెన్షన్ల పంపిణీ పండగ వాతావరణంలా కొనసాగించారు. వలంటీర్ల సహాయం లేకుండానే పింఛన్ పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో రేపు (బుధవారం) పలు కీలక అంశాలపై చర్చల నిమిత్తం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు. ఎల్లుండి పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీలు సహా పలు అంశాలపై అయన వారితో చర్చిస్తారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగే కేటాయింపుల ప్రతిపాదనలపైనా సీఎం మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

విశాఖ సెంట్రల్ జైలులో హోంమంత్రి వంగలపూడి అనిత తనిఖీలు! గంజాయి కేసులో ఏకంగా 1200 మంది అరెస్ట్! 

 

ఏపీలో పెన్షన్ ఒక్క నెల తీసుకోకపోయినా రద్దు అవుతుందా? చంద్రబాబు కీలక ప్రకటన! 

 

జులై నెలలో తిరుమలకు వెళుతున్నారా! అయితే ఈ వివరాలు తెలుసుకోండి! 

 

ఈ నెల 6 న తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్! భేటీకి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్! 

 

వైసీపీ ఓటమికి ముఖ్య కారణం అదే! కీలక విషయాలు బయటపెట్టిన CPI నారాయణ!

  

బస్సులో సీటు కోసం 11 లక్షలు పోగొట్టుకున్నాడు! ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! 

 

జగన్ రెడ్డికి మరో షాక్ ఇచ్చేందుకు వ్యూహం రెడీ! ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు! 

 

ఏపీకి మరో నాలుగు రోజులపాటు వర్ష సూచన! వతావరణ శాఖ హెచ్చరిక! 

 

జీతం తీసుకోను... ఫర్నీచర్ కూడా నేనే తెచ్చుకుంటా! డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం! 

 

ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి తేడా ఏంటో ప్రజలకు తెలిసింది! మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! 

 

హిందూ సమాజం అంటే ఒక్క మోడీ మాత్రమే కాదు! ప్రధానిపై రాహుల్ గాంధీ ఫైర్! 

 

వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! ఉంచుతారా... తొలగిస్తారా? 

                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #BJP #AndhraPradesh #AP #APGovernment #CBN #NaraLokesh #Modi