నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

Header Banner

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

  Wed Jul 03, 2024 20:10        Politics

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. కూటమి ప్రభుత్వం లో జనసేనాని పవన్ కల్యాణ్ కీలక మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యాడు. అనంతరం మంత్రివర్గంతో కలిసి అభివృద్ధి మౌలిక సదుపాయాలు, విజయోత్సవ రాలి పై ప్రస్తుతం పవన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా బుధవారం పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ ప్రాంతంలో భారీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతుండగా.. ఆయన అభిమానులు OG, OG అంటూ అరవడం మొదలు పెట్టారు. దీంతో పవన్ నవ్వూతూ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు మెరుగైన పాలనపై దృష్టి కేటాయించామని.. ఈ సమయంలో మనం ప్రజలకు చేయాల్సిన పనులు వదిలేసి సినిమా షూటింగ్ లో పాల్గొంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని అన్నారు. తనను నమ్మి ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా నెలలో రెండు, మూడు రోజులు సినిమా షూటింగ్లో పాల్గొంటానని తెలిపారు. ఇదే విషయంపై తాను ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లకు తన షేడ్యూల్ తయారు చేసుకొవాలని చెప్పినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అలాగే త్వరలో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కాబోతున్న OG సినిమాను అందరూ చూడాలని, ఆ సినిమా చాలా బాగుంటుందని ఉప్పాడ సభలో తన అభిమానులకు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు! 

 

ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!

 

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

 

అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!

 

నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!

 

అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

 

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

 

శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి! 

 

ఏపీకి పారిశ్రామిక రాయితీలు! రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు! రోడ్లు, పోలవరానికి ప్రత్యేక నిధులు! నేడే చంద్రబాబు ఢిల్లీ టూర్! 

 

సీబీఐకి హై కోర్టు నోటీసులు! కేజ్రీవాల్ అరెస్ట్ పై విచారణ! 

 

కర్ణాటక నుంచి కటకటాల వెనక్కి వెళ్ళడానికి వచ్చిన జగన్! ఈ కామెంట్స్ చూస్తే రక్త కన్నీరే! ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ఈయన పరిస్థితి ఏంటో!

                                                                                 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group  


   #AndhraPravasi #Politics #TDP #JSP #AndhraPradesh #PawanKalyan #PowerStarPawanKalyan #Movies #PSPK #DeputyCM