ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

Header Banner

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

  Thu Jul 04, 2024 19:21        Politics

నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అమరావతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈవీఎం పగులగొట్టిన పిన్నెల్లిని కలిసేందుకు జగన్ ఇవాళ రూ.25 లక్షలు ఖర్చు చేశారని వెల్లడించారు. జైల్లో  ఉన్న పిన్నెల్లి కోసం జగన్ హెలికాప్టర్ లో నెల్లూరు వెళ్లారని వివరించారు. అయితే, పిన్నెల్లి ములాఖాత్ లు అయిపోయినప్పటికీ, మానవతా దృక్పథంతో జగన్ కు అనుమతి ఇచ్చామని అనిత స్పష్టం చేశారు. ములాఖాత్ లు అయిపోయాయని తెలిసి కూడా జగన్ ఉద్రిక్తతలు రగిల్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

"ఈవీఎం బద్దలు కొట్టడం, హత్యాయత్నం వంటి అంశాల్లో పిన్నెల్లి పక్కా ఆధారాలతో దొరికిపోయారు. ఆయన అరెస్ట్ ఎలా జరిగిందో అందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ ఖైదీని కలవాలని నిర్ణయించుకున్నారు... అది ఆయన ఇష్టం. డబ్బుంది కాబట్టి పాతిక లక్షలు ఖర్చుపెట్టుకుని నెల్లూరు వెళ్లారు. పిన్నెల్లికి ములాఖాత్ లు అయిపోయినప్పటికీ, మేం మానవతా దృక్పథంతో ఆలోచించి అనుమతి ఇచ్చాం. నాడు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబ సభ్యులకు మూడో ములాఖాత్ ఇచ్చేవారు కాదు. కానీ ఇవాళ తనకు అనుమతి లేదని తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అక్కడ గలాటా సృష్టించడానికే అనుకోవాలా? 

 

ఇంకా చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం నాటి దాడి కేసులో నిందితుల అరెస్టు! వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ప్రధాన సూత్రదారి!

 

మేం ఇవాళ రూల్స్ పట్టించుకోకుండా మానవతా కోణంలో అనుమతి మంజూరు చేశాం. కానీ జగన్ జైలు నుంచి బయటికి వచ్చి, అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారు. సీసీ టీవీ ఫుటేజి చూసినవారెవరైనా అక్రమ అరెస్ట్ అంటారా? అతడ్ని అరెస్ట్ చేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. మేం చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే, వాటిని దాడులు అని దుష్ప్రచారం చేస్తున్నారు. మరి మీరు ఐదేళ్ల కిందట పాలన మొదలుపెట్టినప్పటి నుంచి చేసిన వాటిని ఏమనాలి? ప్రజావేదిక కూల్చివేత నుంచి మీరు చేసినవి ఏమిటి... దాడులు కాదా...? నా మీదే 23 కేసులు పెట్టారు. మేం కక్ష తీర్చుకోవాలనుకుంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఇవాళ వచ్చి ప్రతీకార దాడులు అంటూ రెచ్చగొడుతున్నారా?" అంటూ అనిత ధ్వజమెత్తారు.

 

ఇవి కూడా చదవండి

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

 

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

 

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

 

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

 

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు! 

 

ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!

 

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

 

అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!

 

నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!

 

అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

 

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

 

శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి! 

                                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #YSJagan #PinnelliArrest #HomeMinister #VangalapudiAnitha