మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు! మంత్రి లోకేశ్ ఫైర్!

Header Banner

మేనమామగా ఉంటానంటూ జగన్ చిన్నారుల నోళ్లుకొట్టారు! మంత్రి లోకేశ్ ఫైర్!

  Thu Jul 04, 2024 20:15        Politics

జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని మరోమారు తేటతెల్లమైందని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. చిన్నారులకు మేనమామలా ఉండి వారి యోగక్షేమాలు చూసుకుంటానని చెప్పిన నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి విద్యార్థులు, చిన్నారులకు తీరని ద్రోహం చేశారని, వారి నోళ్లు కొట్టారని మండిపడ్డారు. 

 

మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నారా లోకేశ్ నేడు సెక్రటేరియట్ లో సమీక్ష నిర్వహించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇవ్వాల్సిన గుడ్డును ఇవ్వడం లేదన్న విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన లోకేశ్ సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రాష్ట్రవ్యాప్తంగా గుడ్ల కాంట్రాక్టర్లకు డిసెంబర్ నుంచి 112.5 కోట్ల రూపాయలు, చిక్కీల కాంట్రాక్టర్లకు గతఏడాది ఆగస్టు నుంచి రూ.66 కోట్ల మేర జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయిందన్న విషయాన్ని అధికారుల ద్వారా లోకేశ్ తెలుసుకున్నారు. భారీగా బిల్లులు బకాయి పడటంతో గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ గుడ్ల సరఫరా నిలిపివేసిన విషయాన్ని గుర్తించారు. వాస్తవం ఇలా ఉంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులకు గుడ్ల పంపిణీ నిలిపివేశారంటూ వైసీపీ అనుకూల మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లు, చిక్కీలకు గత ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టి వెళ్లడంపై ఆయన విస్మయం వ్యక్తంచేశారు. 

 

ఇంకా చదవండి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై మూడేళ్ల క్రితం నాటి దాడి కేసులో నిందితుల అరెస్టు! వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ప్రధాన సూత్రదారి!

 

చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గుడ్లు, చిక్కీలను పంపిణీ చేయాలని, గత ప్రభుత్వం వదిలేసి వెళ్లిన బకాయిలను అతి త్వరలో చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లంతా మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, మధ్యాహ్న భోజన పథకం డైరక్టర్ బి.శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. 

 

ఇదిలావుండగా...ఇటీవల విద్యాశాఖపై మంత్రి లోకేష్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో గత ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవెన పథకాల కింద రూ.3,480 కోట్లు బకాయిలు పెట్టడంతో వారి సర్టిఫికెట్లు వివిధ విద్యాసంస్థల్లో నిలచిపోయిన విషయం వెల్లడైంది. మేనమామలా చూసుకోవడమంటే విద్యార్థులు, చిన్నారులను అవస్తల పాలుజేయడమా? అని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు.

 

ఇవి కూడా చదవండి

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

 

బస్తాలకొద్దీ గత ప్రభుత్వ ఫైళ్ల దహనం! ఇద్దరు నిందితులు అరెస్ట్! వెలుగులోకి కీలక నేత పేరు!

 

ఏంటి ఇది నిజమేనా! రిషి సునాక్ కు ఈ సారి ఓటమి తప్పదా! ఎంతో ఆసక్తికరంగా యూకే ఎన్నికలు!

 

సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా! కారణం ఆదేనా!

 

నెలలో మూడు రోజులు కేటాయిస్తాను... ఉప్పాడలో క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం! ఏంటో చూసేయండి!

 

రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన చంద్రబాబు! ఆ పదకం మళ్ళీ అమలు! 

 

ఏపీలో నిరుద్యోగులకు బిగ్ అలర్ట్! గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా!

 

పార్లమెంటు కొత్త కేబినెట్ కమిటీలు ఏర్పాటు! తెలుగు రాష్ట్రాల ఎంపీలకు పెద్దపీట! 

 

అమరావతిలో జగన్ రెడ్డి విధ్వంసాన్ని వివరించిన చంద్రబాబు! శ్వేత పత్రం విడుదల!

 

నీట్ పరీక్షపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు! ఆ పని చెయ్యండని సలహా!

 

అమరావతిలో జగన్ సర్కార్ చేసిన ఘనకార్యాలు అన్నీ ప్రజల ముందుకు! రాజధానిపై శ్వేతపత్రం విడుదల!

 

అక్రమార్కులతో చేతులుకలిపి ప్రజలను దోచుకుంటున్న దేవాదాయశాఖ అధికారులు! సస్పెన్షన్ కు గురైన పలువురు! 

 

శ్రీవారి అన్నప్రసాదం తయారీపై టీటీడీ కీలక నిర్ణయం! భక్తుల ఫిర్యాదులు పరిగణనలోకి! 

                                                                                    

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #AP #APGovernment #NaraLokesh #ITMinister