లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు!

Header Banner

లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం! రంగంలోకి KTR, హరీష్ రావు!

  Fri Jul 05, 2024 19:45        Politics

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. ట్రయల్ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులోనూ ఆమెకు ఊరట దక్కలేదు. దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానాలు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. కవితకు బెయిల్ నిరాకరిస్తూ జూలై 1వ తేదీన ఢిల్లీ హై కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కవిత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం తీహార్ జైలులో కవితతో ములాఖాత్ అయ్యారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంపై ముగ్గురు చర్చించి.. అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు సుప్రీం కోర్టులో దాఖలు చేయనున్న బెయిల్ పిటిషన్పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో చర్చిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే వరకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదుల బృందంతో సమన్వయం చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టులో ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనుంచడటంతో బెయిల్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులోనైనా కవితకు ఊరట దక్కుతుందా అని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేజారిపోతుంటే.. కేటీఆర్, హరీష్ రావు మాత్రం కవిత బెయిల్ కోసం స్పెషల్ ఫోకస్ పెట్టడం గులాబీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

 

ఇవి కూడా చదవండి

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్! అతి త్వరలో విజయవాడ నుండి కుర్నూల్ కు సర్వీసులు ప్రారంభం! 

 

రేవంత్ రెడ్డితో భేటీపై స్పందించిన చంద్రబాబు! ఏమన్నారంటే!

 

వచ్చే నెల వరకూ సాగునీరు లేనట్టే! కృష్ణా డెల్టా రైతులకు బిగ్ షాక్! 

 

జనసేనాని కొన్న మూడు ఎకరాల భూమి ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఎందుకు కొన్నారంటే!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ! త్వరలోనే అధికారిక ప్రకటన!

 

యూకే: ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి! లేబర్ పార్టీదే విజయం! ఎగ్జిట్ పోల్స్ అంచనా! 

 

బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన ఎమ్మెల్సీలు! రాత్రికి రాత్రే ఆరుగురు జంప్!

 

అమరావతి వాసులకు కేంద్రం చెప్పిన గుడ్ న్యూస్! ఔటర్ రింగ్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్రప్రదేశ్‌లో 'అధికార మార్పిడి'పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! ఏంటో ఒక లుక్ వేయండి! 

   

ఆ విషయం తెలిసి కూడా జగన్ నెల్లూరు బయల్దేరారంటే అర్థం ఏమిటి? హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు!

 

ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 16 మంది టీచర్లు అమెరికాకు! NRI మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులు మీదుగా ఘనంగా సత్కారం! CM చంద్రబాబు విజనరీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశ కల్పన దిశగా! 

                                                                                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AndhraPradesh #Telangana #CBN #Delhi #KCR #KTR #HarishRao #DelhiLiquorScam #Kavitha #BRS