రోజురోజుకీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు! తరువాత ఎవరనేదానిపై ఉత్కంఠ!

Header Banner

రోజురోజుకీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు! తరువాత ఎవరనేదానిపై ఉత్కంఠ!

  Sun Jul 07, 2024 11:07        Politics

ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది. శనివారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హస్తం కండువా కప్పుకోవడం ఆ పార్టీని షాక్ కు గురి చేసింది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలు.. ఇన్చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని వారు చెబుతున్నారు.. కాంగ్రెస్ లోకి చేరేందుకే భేటీ అయ్యారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది.

 

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ వివేకానంద మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబు తో భేటీ అయ్యారు. వీరిలో అరికెపూడి గాంధీ, వివేకానంద, కృష్ణారావులకు గతంలో టీడీపీ తో అనుబంధం ఉంది. సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డిలకు గతంలో కాంగ్రెస్తో అనుబంధం ముంది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి ప్రభుత్వంలో కీలకమైన మంత్రిని సెక్రటేరియట్ లో కలవడం పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నుంచి అన్ని రకాల హామీలు లభిస్తే, నేడో, రేపో ఆ ఎమ్మెల్యేలు కూడా హస్తం కండువా కప్పుకోవచ్చనే చర్చ జరుగుతున్నది. అయితే అభివృద్ధి కోసమే తాము మంత్రిని కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా.. చేరికలపై వస్తున్న వార్తలను వారు ఖండించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. మరోవైపు ఆయా ఎమ్మెల్యేలు శనివారమే సీఎం సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉన్నదని, కానీ ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రుల మీటింగ్ నేపథ్యంలో వాయిదా పడిందనే చర్చ కూడా గాంధీభవన్ లో జరుగుతుంది. వారు ఏ క్షణమైనా పార్టీలోకి రావొచ్చని చెబుతుండడం గమనార్హం.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

వలసలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించడం లేదు. స్థానిక పరిస్థితులు, నేతల మధ్య ఉన్న వైరం, అభివృద్ధి నిధులు తదితర కారణాలతో ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సైతం హస్తం కండువా కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా చేరితే, గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ బలం మరింత పెరగనున్నది.

 

మాజీ సీఎం కేసీఆర్ లక్కీ నంబరు 'ఆరు'ను టార్గెట్ గా చేసుకునే రేవంత్ తన వ్యూహాలను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలను ఒకేసారి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు మరో ఆరుగురు ఎమ్మెల్యేలకు హస్తం కండువా కప్పాలని ప్లాన్ చేస్తున్నారు. వరుసగా వలసలు, లక్కీ నంబరుతో జాయినింగ్స్ వంటివి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మానసికంగా దెబ్బతీసేందుకే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

 

ఇవి కూడా చదవండి

రెండు భాగాలుగా విడిపోయిన పంచవటి ఎక్స్ ప్రెస్! భయంతో ప్రయాణికులు! 

 

బాయ్కాట్ జియో... పోర్ట్ టు బీఎస్ఎన్ఎల్! సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!

 

గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!

 

కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి! 

 

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు హత్య కేసులో 8 మంది అరెస్ట్! వెలుగులోకి కొత్త నిజాలు!

 

మీడియా ముందు ప్రత్యక్షమైన భోలే బాబా! హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే! 

 

ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!

 

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!

 

చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో అంత ముఖ్యమైన టాపిక్ పై నో డిస్కషన్! ఎందుకంటే! 

                                                                                                               

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 

 


   #AndhraPravasi #Politics #TDP #YCP #AndhraPradesh #BRS #Congress #Te,langana #AndhraPradeshState #TelanganaState #AP #TG #PoliticalParties