యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ కు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ! అందులో ఏముందంటే!

Header Banner

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ కు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ! అందులో ఏముందంటే!

  Sun Jul 07, 2024 15:05        Politics

హత్రాస్లో తొక్కిసలాట ప్రమాదంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కి బహిరంగ లేఖ రాశారు. యూపీలోని హత్రాస్ జిల్లాలో రాహుల్ గాంధీ శనివారం పర్యటించారు. హత్రాస్ ఘటనలో చనిపోయిన, గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనలో బాధితులకు నష్టపరిహారంపై సీఎం యోగీకి లేఖ రాశారు. ఈ లేఖలో హత్రాస్లో జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో 120 మందికి పైగా మరణిచారనేది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, బాధతో ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. అలీఘర్, హత్రాస్ జిల్లాల బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి బాధలను తెలుసుకోవడానికి ప్రయత్నించానని, ఆ సమయంలో వారిని ఓదార్చడానికి కూడా మాటలు రాలేదని చెప్పారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ ప్రమాదంలో కోల్పోయిన వాటిని భర్తీ చేయడం సాధ్యం కాదు. కానీ బాధిత కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా వారి బాధలను కొంత తగ్గించవచ్చు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదు. నష్టపరిహారం మొత్తాన్ని పెంచి వీలైనంత త్వరగా అందించాలని సీఎంకు విన్నవించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి, వారికి కూడా తగిన పరిహారం అందించాలని కోరారు. ఈ ఘటనలో స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కారణమని బాధిత కుటుంబాలు తనతో చెప్పాయని, ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరిపి దోషులకు కఠిన శిక్ష పడే విధంగా చూడాలని, భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించాలని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలియజేశారు.

 

ఇవి కూడా చదవండి

యూనీఫార్మ్ వేసుకోలేదని టీచర్ మందలించాడాని ఎం చేశాడో తెలుసా! అతన్ని కత్తితో...

 

చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత! వాతావరణ శాఖ హెచ్చరికలు!

 

ఫ్రాన్స్ ఎన్నికల్లో ఓటేయనున్న యానాం వాసులు! తమిళనాడులో ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు!

 

రోజురోజుకీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి పెరుగుతున్న వలసలు! తరువాత ఎవరనేదానిపై ఉత్కంఠ!

   

గోవా వెళ్లాలనుకునే టూరిస్టులకు సూపర్ న్యూస్! ఇకపై సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు!

 

కేరళను కలవరపెడుతున్న అరుదైన ఇన్ఫెక్షన్! ఇప్పటికే ముగ్గురు మృతి! 

  

ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా దుర్గమ్మ ఆషాడ ఉత్సవాలు! 16 వరకూ వారాహి నవరాత్రులు!

 

తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య! ఫుడ్ డెలివరీ ఏజెంట్స్‌గా వచ్చి దాడి!

                                                                                                                

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #India #Hathras #UttarPradesh #BholeBaba #HathrasIncident #BholeBabaResponsible #HathrasStampede #RahulGandhi #YogiAdityanath