ఎంవీవీ, జీవీలకు నో ఎంట్రీ! తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! డిప్యూటీ సీఎం కూడా అదే బాటలో!

Header Banner

ఎంవీవీ, జీవీలకు నో ఎంట్రీ! తేల్చిచెప్పిన సీఎం చంద్రబాబు! డిప్యూటీ సీఎం కూడా అదే బాటలో!

  Tue Jul 09, 2024 10:35        Politics

వైసీపీ పాలనా కాలంలో విశాఖలో ఒక వెలుగు వెలిగి రూ.వేల కోట్ల విలువైన వివాదాస్పద భూములను చేజిక్కించుకున్న విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన సహచరుడు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.వెంకటేశ్వరరావు (జీవీ)లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ఘోర ఓటమి తరువాత విశాఖలోని రూ.వేల కోట్ల ఆస్తులను రక్షించుకొనేందుకు, కేసులు, అరెస్టుల నుంచి తప్పించుకొనేందుకు కూటమి పార్టీల్లో చేరేందుకు వారు చేసిన ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురు అవుతున్నాయి.

 

తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద వీరిద్దరి గురించి కీలకమైన వ్యక్తి ఒకరు ప్రస్తావించగా ఆయన తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. అంత చెడ్డ పేరున్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంటర్టైన్ చేయవద్దని, వారి వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన తన స్పష్టమైన వైఖరిని తెలియజేశారని తెలిసింది. దీంతో వీరి తరపున వకాల్తా పుచ్చుకుని వెళ్లిన వ్యక్తి నిరాశతో వెనుదిరిగారు. అంతకుముందు ప్రభుత్వ పెద్దలతో వీరు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని, వివాదాస్పద సీబీసీఎన్సీ, హయగ్రీవల్లో 15 నుంచి 20 శాతం వాటాను ఆఫర్ చేస్తున్నారని ప్రచారం జరిగింది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వీరిని దూరంగా పెట్టాలనే ధోరణితోనే వున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ విశాఖ వచ్చినప్పుడు వివాదాస్పద సీబీసీఎన్సీ భూముల వద్ద జరుగుతున్న తవ్వకాలు, పనులను పరిశీలించారు. తాము అధికారంలోకి వస్తే ఈ క్రైస్తవుల భూములను కొట్టేసి కడుతున్న ఈ ప్రాజెక్టును నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అంతటితో ఆగక బ్యాంకుల వారు ఎవ్వరూ ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేయవద్దని, చేస్తే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. వృద్ధులు, అనాథల కోసం కేటాయించిన హయగ్రీవ ప్రాజెక్టులో ఎంవీవీ, జీవీలు విల్లాలు కడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న తీరుపై అదే పార్టీకి చెందిన పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో జనసేనలో వీరికి దారులు మూసుకుపోయినట్లే.

 

ఇక వీరికి కనిపిస్తున్న మరో కూటమి పార్టీ బీజేపీనే. విశాఖ బీజేపీ నేతలు, ముఖ్యంగా ఉత్తర శాసనసభ్యుడు పి.విష్ణుకుమార్ రాజు వీరి వ్యవహారాలపై గుర్రుగా వున్నారు. గతంలో ఆయన సీబీసీఎన్సీ భూముల వద్ద ధర్నాకు కూడా దిగారు. అయితే బయట నుంచి వచ్చిన కొందరు వీరి పట్ల గతంలో సానుకూలత వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆ పార్టీ కూడా వీరి విషయంలో జాగ్రత్త పడింది.

 

ఇవి కూడా చదవండి

కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే జరిగేది అదే! రేవంత్ రెడ్డి ఏమన్నారంటే!

 

రైతు భరోసా అమలుపై చంద్రబాబు కీలక నిర్ణయం! ఏంటో చూసేయండి!

 

ఏపీలో మహిళలకు తీపికబురు చెప్పిన చంద్రబాబు సర్కార్! ఆ పదకం వచ్చేనెల నుండి అమలు!

 

మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త! అకౌంటులో రూ. 5,000 జమ!

  

నామినేటెడ్ పదవుల భర్తీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఆ పోస్టులు కోరిన డిప్యూటీ సీఎం!

 

ప్రధాని పదవికి అడుగు దూరంలో రాహుల్ గాంధీ! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  

ఆ విషయంలో మాత్రం తెలంగాణకు మొదటి స్థానం! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

                             

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:              

Whatsapp group

Telegram group

Facebook group 


   #AndhraPravasi #Politics #AP #AndhraPradesh #Telangana #TG #APGovernment #TGGovernment #CBN #CMCBN #RevanthReddy #APTGCMs #BJP #Congress