భోగాపురంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా దృష్టి! ఎయిర్ పోర్టు పనులు పూర్తవుతాయని..రామ్మోహన్

Header Banner

భోగాపురంపై చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా దృష్టి! ఎయిర్ పోర్టు పనులు పూర్తవుతాయని..రామ్మోహన్

  Tue Jul 09, 2024 18:12        Politics

కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేడు విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఎల్లుండి సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలనకు వస్తున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కూడా రామ్మోహన్ నాయుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్ పోర్టు గుండెకాయ వంటిదని అభివర్ణించారు. నిర్ణీత సమయంలోనే భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామని చెప్పారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు పనులు పూర్తవుతాయని వివరించారు. భోగాపురం ఎయిర్ పోర్టుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారని రామ్మోహన్ నాయుడు  తెలిపారు. విమానాశ్రయ పనులపై సీఎం చంద్రబాబు సూచనలు కూడా తీసుకుంటామని అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం విమానాశ్రయ పనులను ఆలస్యం చేసిందని ఆరోపించారు.

 

ఇంకా చదవండి:  సీఎం చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం! రుణ ప్రణాళిక విడుదల! పలు అంశాలపై సబ్ కమిటీ

 

డిసెంబరు నాటికి టెర్మినల్ భవనం పూర్తి చేస్తామని చెప్పారు. చిన్న చిన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు. విమానాశ్రయం పూర్తయితే దాదాపు 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వారే కాకుండా ఒడిశా వాసులకు కూడా భోగాపురం ఎయిర్ పోర్టు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే, భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు ఎన్నో కంపెనీలు వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయలేక, గడువులు పెంచుకుంటూ పోయిందని, కానీ తాము అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి నెలలోనే ప్రాజెక్టును సందర్శించి, గడువు తేదీ చెబుతున్నామని, ఈ విషయాన్ని తాము ఓ బాధ్యతగా తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు వివరించారు. కేంద్రమంత్రిగా ఈ ఎయిర్ పోర్టుపై తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు.

 

ఇంకా చదవండి: రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బహ్రెయిన్ మరియు సౌదీలలో ట్రావెల్ రంగానికి చెందిన ఉద్యోగాల అవకాశం! ఆకర్షణీయమైన జీతం! వెంటనే అప్లై చేసుకోండి!

 

ఏపీపై ఆగ్రహంగా బంగాళాఖాతం? భారీ నుంచి అతి భారీ వర్షాలు! వాతావరణ కేంద్రం అలర్ట్!

 

ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఛార్జీల పెంపు! ఉన్నత విద్య కోసం వెళ్ళే విద్యార్థులకు భారీ షాక్!

 

ఆ రోజు భూమికి అతి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్! నాసా ఏం చెప్తుంది అంటే!

 

మంత్రులతో కలిసి రేపు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి! ఎందుకో తెలుసా?

 

మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు! 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!

 

అమరావతి ORR వలన రాష్ట్ర ముఖచిత్రం ఏ విధంగా మారనున్నది! ప్రాజెక్టు పూర్తి విశేషాలు! జరగబోయే మార్పులు! ఆ ప్రాంతాల వారికి పండగే!

 

అమెరికాలో కాల్పుల మోత! ఇంటి యజమాని సహా నలుగురి మృతి! కాల్చింది ఎవరో కాదు సొంత కొడుకే! కారణం?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group


   #AndhraPravasi #Bhogapuram #Airport #Kinjarapu #RamMohanNaidu #Chandrababu #TDP #AndhraPradesh